ఫైనాన్స్ గొడవలో హీరోపై నిర్మాత వ్యంగ్యం

Thu Jun 10 2021 13:19:43 GMT+0530 (IST)

Producer satire on hero in finance scandal

ఓ సినిమా ఆర్థిక వ్యవహారాల విషయంలో తేడా రావడంతో నిర్మాత కం ఫైనాన్షియర్ ఆర్.బి.చౌందరిపై హీరో విశాల్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. సదరు ఫైనాన్షియర్ కం సీనియర్ నిర్మాత నుండి రుణం తీసుకునేటప్పుడు తాను సమర్పించిన పత్రాలను తప్పుగా చూపిస్తున్నారనేది విశాల్ ఆరోపణ. అయితే ఇదంతా వెర్రి వ్యవహారం అంటూ కొట్టి పారేసారు ఆర్బీ చౌదరి.అప్పు తీసుకునేటప్పుడు విశాల్ తనకు అన్ని పత్రాలను సమర్పించినట్లు ఆర్.బి.చౌదరి చెబుతున్నారు. తిరుప్పూర్ సుబ్రమణియన్ - ఆర్‌బి చౌదరి సంయుక్తంగా విశాల్ కు రుణ మొత్తాన్ని ఇచ్చారు. `ఆయుధ పూజై` దర్శకుడు శివకుమార్ ఈ ఒప్పందానికి మధ్యవర్తిత్వం వహించి పత్రాలను సిద్ధం చేశారు. కానీ శివకుమార్ గుండెపోటుతో ఇటీవల కన్నుమూయడంతో ఆ తరువాత తమ వద్ద పత్రాలు దొరకలేదని ఆర్బి చౌదరి ఒక మీడియాకు తెలిపారు.

పెండింగ్ క్లియరైందని రాతపూర్వక పత్రం ఇచ్చినా విశాల్ భయపడుతున్నారు..  నేను చెన్నైకి తిరిగి వచ్చాక సమస్యను పరిష్కరిస్తాను!! అని ఆర్బీ చౌదరి అన్నారు. ఆర్.బి. చౌదరి సీనియర్ నిర్మాత కం ఫైనాన్షియర్. తెలుగు-తమిళంలో చాలా భారీ చిత్రాల్ని నిర్మించారు. మెగా కాంపౌండ్ కి ఆయన ఎంతో సన్నిహితుడు. ఆర్బీ చౌదరి వారసుడు జీవా రంగం సినిమాతో తెలుగు వారికి సుపరిచితం. జీవా ప్రస్తుతం తమిళంలో నటిస్తున్నారు.