హిందీలో 700 థియేటర్లలో 'కార్తికేయ-2'

Tue Aug 16 2022 20:00:01 GMT+0530 (IST)

Producer Allu Arvind Speech At Karthikeya 2 Success Meet

నిఖిల్ కథానాయకుడిగా నటించిన 'కార్తికేయ-2' హిట్ టాక్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అయిన  సినిమా అన్ని చోట్లా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఇక హిందీ బెల్ట్ లో 'పుష్ప' తరహాలో ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయి అక్కడా దూసుకుపోతుందని తుపాకీ.కామ్  ఎనాలసిస్ ని అగ్ర నిర్మాత అల్లు అరవింద్ సైతం ధృవీకరించారు.హిందీ బెల్ట్ లో పాజిటివ్ టాక్ రావడంతో షోల సంఖ్య..థియేటర్ల సంఖ్య పెంచుతున్నట్లు ఇప్పటికే లీకైంది. ఆ విషయాన్ని సదరు నిర్మాత  కార్తికేయ సక్సెస్ మీట్ లో అంగీకరించారు.ఆయన మాటల్లోకి ఓసారి  వెళ్తే.." ఈ సినిమా హిందీలో సరదాగారిలజీ్ చేస్ద్దామని 50 థియేటర్లలో రిలీజ్ చేసారు. రెండో రోజు అదే సినిమా 200 థియేటర్లకి స్ప్రెడ్ అయింది. ఇవాళ అదే సినిమా కేవలం హిందీలోనే 700 థియేటర్లలో ఆడుతుందంటే?  దాని సత్తా ఏంటో  అర్దమవుతుంది.

ఈరోజు ఒక సినిమా హిందీలో ఆడుతుంది అంటే లాంగ్వేజ్ పరంగా హద్దులు ఎలా చెరిగిపోతున్నాయో తెలుస్తుంది. ప్రజల గుండెల్లో నిలిచిపోతున్న సినిమాలు గా నిలుస్తున్నాయి. సినిమాలో సత్తా లేకపోతే ఆడవు కదా. ఇలాగే ఎంతో నిజాయితీగా పుష్పని మొదలుపెట్టారు. అక్కడా రిలీజ్ చేసి  సంచలనం చేసాం. నిఖిల్ కోసం ఈ సినిమా ప్రత్యేకంగా ఆడాలని కోరుకుంటున్నాను.

న్యూఏజ్ దర్శకులకు ఒక డెఫినషన్ అంటూ ఏమీ ఉండదు.  కానీ చందు మొంటేడి డైరెక్షన్ లో అది కనబడుతుంటుంది. 'అఖండ' లో శివత్మం మీద  ఎంతో ఎమోషన్ గా చూపించారు.మరో రెండేళ్లలో విష్ణువు మీద కూడా మొదలు పెడతారని అప్పట్లో అనుకున్నా. ఇదే బేస్ గురించి ఓ పెద్ద డైరెక్టర్ తో కూడా  డిస్కస్ చేసా.

కానీ ఏడాది కాకుండా చందు  విష్ణుతత్వం మీద సినిమా చేయడం నచ్చింది. మధ్య మధ్యలో యానిమేషన్ చూపిస్తూ మొండేటి కన్విన్సింగ్ గా కథని నడిపించాడు .  ఓ  కామన్ కాజ్ కోసం హీరో హీరోయిన్స్ తో పాటు ఆడియన్స్ ని   చందు పరుగులు పెట్టించాడు. అడ్వెంచర్ చిత్రాలకు  పౌరాణికం బేస్ ఇచ్చి మళ్లీ దాని కలియుగంలో కి తీసుకురావడం చాలా కన్విన్స్ గా ఉంది. ఇండస్ర్టీ భయ భ్రాంతుల్ని 'బింబిసార'..'సీతారామం'..'కార్తికేయ-2' చిత్రాలు  తొలగించాయి.

సినిమా బాగుంటే జనాలు థియేటర్లకి  వస్తారు అని ఈ సినిమాలు రుజువు చేసాయి. మాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చాయ''న్నారు అరవింద్. అలాగే నిఖిల్ హీరోగా తమ సంస్థలో ఓ సినిమా నిర్మిస్తున్నట్లు..చందు మొండేటితో కూడా ఓ సినిమా ప్రత్యేకంగా చేస్తున్నట్లు అరవింద్ రివీల్ చేసారు.