ప్రియాంక విడాకులు.. అంతా బుస్సేనా?

Wed Nov 24 2021 17:00:02 GMT+0530 (IST)

Priyanka commented Nick Jonas workout video

అక్కినేని సమంత పేరు కాస్తా సోషల్ మీడియాలో ‘ఎస్’ అని.. ఆ తర్వాత ‘సమంత’ అని మారగానే జనాలకు ఏదో తేడా జరుగుతోందని అర్థమైంది. పెళ్లి తర్వాత ఎంతో ఇష్టంగా తన పేరు వెనుక చేర్చుకున్న ‘అక్కినేని’ పదాన్ని సమంత తొలగించేయడం చూసి ఆమె నాగచైతన్య నుంచి విడిపోతోందనే నిర్ణయానికి వచ్చేశారు జనాలు. ముందు దీని మీద ఊహాగానాలు నడిచాయి. తర్వాత నిజంగానే చైతూ-సామ్ విడిపోతున్నట్లుగా ప్రకటన వచ్చింది.కాగా ఇటీవల బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా సైతం సోషల్ మీడియాలో తన పేరు వెనుక ఉన్న భర్త ఇంటి పేరు ‘జోనాస్’ను తొలగించడంతో ఊహాగానాలు మొదలయ్యాయి. సమంత ఉదంతం తాలూకు అనుభవం దృష్ట్యా ప్రియాంక కూడా విడాకులు రెడీ అయిపోయిందని జనాలు డిసైడైపోయారు. ఐతే ప్రియాంక విషయంలో అలాంటి సంకేతాలేమీ కనిపించడం లేదు. ఆమె భర్తతో చాలా సంతోషంగానే ఉన్నట్లుగా కనిపిస్తోంది.

తాజాగా నిక్ జోనాస్ వర్కవుట్ వీడియోపై ప్రియాంక స్పందిస్తూ సరదాగా కామెంట్ చేసింది. అథడి కండలు చూసి ప్రేమలో పడిపోయానని అంది. మరోవైపు ప్రియాంక-నిక్ కలిసి ఇటీవలే పాల్గొన్న ఒక హాలీవుడ్ టీవీ షో ఎపిసోడ్లో ఇద్దరూ సందడి చేసిన వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

ఇందులో ప్రియాంక ఒక చోట తాము పిల్లల్ని కనడంపై ఆసక్తికర వ్యాఖ్య చేసింది. ‘‘మా ఇద్దరికి ఇప్పటిదాకా పిల్లలు లేరు. కానీ ఈ రోజు మీ అందరి ముందు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మేమిద్దరం..’’ అంటూ ఆగిపోయింది. దీంతో ఆమె వైపు నిక్ షాకవుతూ చూశాడు. ప్రియాంక తీరు చూస్తే తామిద్దరం త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నామని చెప్పేట్లు కనిపించింది.

కానీ పాస్ ఇచ్చాక కొనసాగిస్తూ.. ‘‘మేమిద్దరం ఈ రోజు రాత్రి డ్రింక్ చేసి రేపు ఉదయం ప్రశాంతంగా నిద్ర పోవాలనుకుంటున్నాం’’ అంటూ నవ్వేసింది. కొన్ని రోజుల ముందే పాల్గొన్న షోలో ఇంత సరదాగా ఉన్న కపుల్ విడిపోతుందని ఎలా అనుకుంటాం? కాబట్టి ఇక ఈ ఊహాగానాలకు తెరదించేయొచ్చు.