Begin typing your search above and press return to search.

ఫోటో టాక్ : రెండేళ్ల క్రితం మొదటిసారి పీసీ నిక్

By:  Tupaki Desk   |   26 May 2020 7:10 AM GMT
ఫోటో టాక్ : రెండేళ్ల క్రితం మొదటిసారి పీసీ నిక్
X
అంతర్జాతీయ నటిగా గుర్తింపు దక్కించుకున్న ముద్దుగుమ్మ ప్రియాంక చోప్రా అమెరికన్ సింగర్ నిక్ జోన్స్ ను ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వీరిద్దరి అన్యోన్య దంపతులుగా పేరు తెచ్చుకున్నారు. పెళ్లి సమయంలో ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు విమర్శకు చేశారు. కనీసం ఏడాది కాలం పాటు కూడా వీరు కలిసి ఉండరు అంటూ విమర్శలు వచ్చాయి. కానీ నిక్ తో ప్రియాంక చోప్రా ప్రేమ అందరికి ఆదర్శంగా నిలిచింది.

తనకు నిక్ పై ఉన్న ప్రేమను ఎప్పటికి అప్పడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉండే ప్రియాంక చోప్రా తాజాగా మరో సారి నిక్ పై తనకున్న ప్రేమను తెలియజేసేలా ఫోటోను షేర్ చేసింది. సరిగ్గా రెండు సంవత్సరాల క్రితం తీసుకున్న ఫోటో ఇది అంటూ ప్రియాంక చోప్రా పోస్ట్ చేసింది.

రెండు సంవత్సరాల క్రితం మొదటి సారి డేట్ కు వెళ్లిన సమయంలో తీసుకున్న ఫోటో అంటూ ఈ ఫోటోను పోస్ట్ చేసింది. నీతో జీవితం ఎప్పటికి సంతోషంగా సాగాలని కోరుకుంటున్నాను అంటూ పీసీ తన ప్రేమను తెలియజేసింది.