Begin typing your search above and press return to search.

బాయ్ ఫ్రెండ్ వార్తలపై హీరోయిన్ కౌంటర్

By:  Tupaki Desk   |   27 Jun 2022 12:30 PM GMT
బాయ్ ఫ్రెండ్ వార్తలపై హీరోయిన్ కౌంటర్
X
టాలీవుడ్ ఇండస్ట్రీలో బ్యూటిఫుల్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న ప్రియాంక జవాల్కర్ మంచి హిట్ సినిమాతో పలకరించి చాలా కాలం అయ్యింది. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ఏదో ఒక ఫోటో తో ఆకట్టుకునే ఈ బ్యూటీ రీసెంట్ గా మరో ప్రత్యేకమైన ఫోటో షూట్ తో కూడా హాట్ టాపిక్ గా నిలిచింది ట్రెడిషనల్ లుక్ లోనే కనిపిస్తూ కాస్త గ్లామర్ డోసు కూడా పెంచడంతో ఆ ఫోటోలు చాలా తొందరగానే వైరల్ అయ్యాయి.

ఇక రీసెంట్ గా ప్రియాంక జవాల్కర్ ప్రేమలో పడినట్లు ఆమె బాయ్ ఫ్రెండ్ కూడా అదే ఫోటో షూట్ లో పాల్గొన్నాడు అని కొన్ని వెబ్ సైట్ లలో వార్తలు కూడా వచ్చాయి. అయితే ఈ విషయంపై ప్రియాంక జవాల్కర్ వెంటనే క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఇటీవల వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని అతను ఫోటో షూట్ లో వర్క్ చేయడానికి వచ్చిన ఒక పర్సన్ అని ఆమె చాలా సున్నితంగా తెలియజేసింది.

ఈ క్లారిటీ ఇవ్వడానికి కారణం మా అమ్మ వార్తలు చూసి తనని అడుగుతోంది అని అందుకే ఈ ఫోటో ద్వారా క్లారిటీ ఇస్తున్నట్లుగా ప్రియాంక జవాల్కర్ సోషల్ మీడియాలో స్పందించింది. ఇక ఈ బ్యూటీ సినిమాల విషయానికి వస్తే మొదట కలవరమాయే మదిలో అనే సినిమాతో 2017లో వెండితెరకు పరిచయమైంది. ఆ తరువాత టాక్సీ వాలా సినిమా తో విజయ్ దేవరకొండ తో కలిసి మంచి సక్సెస్ అయితే అందుకుంది.

కానీ ఇండస్ట్రీలో అందుకు తగ్గట్టుగా ఆమెకు అవకాశాలు రాలేదు. చివరగా ఎస్ ఆర్ కళ్యాణ మండపం సినిమాతో పర్వాలేదనిపించింది. ఇక ఇప్పుడు ఒక వెబ్ సిరీస్ లో కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ బ్యూటీ గ్లామరస్ ఈ తరహా ఫోటోలతో ఎలాంటి పాత్రల్లో అయినా నటిస్తానని చెప్పకనే చెబుతున్నట్లు అర్థమవుతోంది. పాత్ర డిమాండ్ చేస్తే అందుకు తగ్గట్టుగా తనను తాను మార్చుకోవడానికి సిద్ధమే అని కూడా చెబుతోంది. మరి ప్రియాంక జవాల్కర్ భవిష్యత్తులో ఎలాంటి సినిమాలలో ఆఫర్లు అందుకుంటుందో చూడాలి.