బాలయ్య ఛాన్స్.. అమ్మడికి ప్లస్సా.. మైనస్సా..!

Tue Dec 06 2022 10:04:08 GMT+0530 (India Standard Time)

Priyanka Jawalkar Is One The Female Leads In NBK 108

గ్లామర్ ఫీల్డ్ లో ఎవరికి ఎప్పుడు ఎందుకు అవకాశాలు వస్తాయో ఎవరికి తెలియదు. కొంతమంది భామలు కెరీర్ ఎంట్రీ ఇచ్చిన ఫస్ట్ సినిమాతోనే సూపర్ క్రేజ్ తెచ్చుకుని ఆ ఫాం కొనసాగిస్తారు. కొందరు మాత్రం వారి టాలెంట్ ని గుర్తించబడే దాకా ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. చాలామంది హీరోయిన్స్ అందంగా ఉన్నా కెరీర్ విషయంలో మాత్రం అంత సాటిస్ ఫ్యాక్షన్ ఉండదు. అలాంటి వారిలో ఒకరు ప్రియాంక జవల్కర్. రౌడీ హీరో విజయ్ దేవరకొండతో టాక్సీవాలా సినిమా చేసిన అమ్మడు ఆ మూవీ తో క్రేజ్ తెచ్చుకున్నా దాన్ని అవకాశాలుగా మలుచుకోవడంలో విఫలమైంది.  ఎస్.ఆర్ కళ్యాణమండపం సినిమాతో అలరించినా ఎందుకో ప్రియాంకా కి సరైన గుర్తింపు రాలేదు. స్టార్ హీరోయిన్ కావాల్సిన క్వాలిటీస్ అన్నీ ఉన్నా సరే ప్రియాంక విషయంలో లక్ ఫేవర్ చేయట్లేదు. అందుకే అమ్మడికి పెద్దగా అవకాశాలు రావట్లేదు.

అరకొర అవకాశాలతో కెరీర్ వెల్లదీస్తున్న అమ్మడికి బాలయ్య 108వ సినిమా ఆఫర్ వచ్చినట్టు టాక్. నందమూరి బాలకృష్ణ అనీల్ రావిపుడి కాంబినేషన్ లో వస్తున్న మూవీ లో ప్రియాంక కి అవకాశం వచ్చిందట. సీనియర్ హీరోనే అయినా బాలయ్య సినిమాలో చేస్తే ఎక్కువ మైలేజ్ వచ్చే ఛాన్స్ ఉంది.

అయితే ప్రియాంక ఆ మూవీ కి ఓకే చెప్పినా అది తనకు ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా అన్న ఆలోచనలో ఉందట. సీనియర్ హీరోలతో చేస్తే ఇక యంగ్ హీరోల సినిమా ఛాన్సులు రాకపోవచ్చు అనే టాక్ ఉంది. అయితే అందరికీ అలా జరుగుతుందని కూడా చెప్పలేం.

ఏమో ఒకవేళ ప్రియాంకా బాలకృష్ణ సినిమాతోనే లైం లైట్ లోకి రావొచ్చు. అదీగాక అనీల్ రావిపుడి సినిమా కాబట్టి హీరోయిన్స్ కి మంచి స్కోప్ ఉంటుంది. సీనియర్ హీరోలకు హీరోయిన్స్ దొరకని పరిస్థితుల్లో వచ్చిన ఈ ఛాన్స్ ని వాడుకోవాలని చూస్తుంది ప్రియాంక జవల్కర్.

అసలేమి అవకాశాలు లేకుండా ఉండటం కన్నా ఏదో ఒక సినిమా చేయడం మంచిది. అందుకే ప్రియాంకా ఎన్.బి.కె 108 మూవీ ఒప్పుకోవడం ఆమె కెరీర్ కు ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒకవేళ సినిమాలో అమ్మడి పాత్ర క్లిక్ అయితే ఆమె ఫేట్ మారిపోయే ఛాన్స్ ఉంది. ఈ మూవీలో శ్రీ లీల కూడా నటిస్తుందని తెలుస్తుంది.

కన్నడ భామ శ్రీ లీల చేసింది ఒక్క సినిమానే కానీ అమ్మడికి టాలీవుడ్ నుంచి క్రేజీ ఆఫర్లు వచ్చాయి. ప్రస్తుతం ధమాకా మెగా హీరో సినిమాల్లో నటిస్తున్న శ్రీ లీల బాలయ్య సినిమాలో డాటర్ రోల్ చేస్తుందని తెలుస్తుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.