బాలీవుడ్ మాఫియాపై విరుచుకుపడ్డ పీసీ మేనేజర్

Thu Mar 30 2023 23:04:36 GMT+0530 (India Standard Time)

Priyanka Chopra manager opens about Bollywood Mafia

బాలీవుడ్ లో కొందరు పెద్దలు మాఫియాగా మారి ఔట్ సైడర్స్ పై ఎలాంటి కుట్రలు చేస్తారో క్వీన్ కంగన ప్రతిసారీ గొంతు చించుకుని మీడియాలకు వెల్లడిస్తూనే ఉంది. కానీ ఆ గోడు ఎవరూ పట్టించుకోరు. ఇంచుమించు కంగన ఎదుర్కొన్నదే ప్రియాంక చోప్రా కూడా ఒక ఔట్ సైడర్ గా ఎదుర్కొంది. ఇటీవలే దీనిపై ఓ మీడియా చాట్ లో బహిరంగంగా వెల్లడించింది. తనని కొందరు సినీపెద్దలు కార్నర్ చేసారని అవకాశాలు రాకుండా చేసారని అందువల్లనే బాలీవుడ్ వదిలి హాలీవుడ్ కి వెళ్లాల్సి వచ్చిందని కూడా పీసీ తెలిపారు. అక్కడ గ్రూప్ పాలిటిక్స్ ఎక్కువగా రన్ అవుతుందని ఆ గుంపులో కలిస్తేనే అవకాశాలిస్తారని ఒంటరి గా జయించడం కష్టమని కూడా పీసీ పేర్కొంది.



పీసీ ఓపెనైన తర్వాత తనకు మద్ధతుగా పలువురు సెలబ్రిటీలు ముందుకు వచ్చారు. ఫ్యాషన్ కొలీగ్ కంగన.. కాశ్మీర్ ఫైల్స్ ఫేం అగ్నిహోత్రి పీసీకి మద్ధతుగా నిలిచారు. ఇప్పుడు ప్రియాంక చోప్రా మేనేజర్ కూడా తన వెర్షన్ ఓపెనైంది. ప్రియాంక చోప్రా మేనేజర్ అంజులా ఆచారి మాట్లాడుతూ.. బాలీవుడ్ ప్రముఖులు ప్రియాంక చోప్రాపై ప్రతికూలతను వ్యాప్తి చేశారని పేర్కొన్నారు. పీసీ ఎప్పుడూ బాలీవుడ్ లో పని చేయలేదు! అని తనని హెచ్చరించారని కూడా తెలిపారు.

ఒక పోడ్ కాస్ట్ లో మాట్లాడుతూ హిందీ చిత్ర పరిశ్రమలో  శక్తివంతమైన వ్యక్తుల రాజకీయాలతో విసిగిపోయానని .. కొందరు తనను బ్లాక్ లిస్ట్ లో చేర్చినట్లు పీసీ బహిర్గతం చేసింది. ఏడాది క్రితం మేనేజర్ అంజులా ఆచార్య ఓ ఇంటర్వ్యూలో ఇలాంటి హింట్ ఇచ్చారు.

ఫోర్బ్స్ తో మాట్లాడిన అంజులా తాము కలిసి పనిచేయడం ప్రారంభించినప్పుడు ప్రియాంక చుట్టూ చాలా ప్రతికూలత ఉందని అందులో ఎక్కువ భాగం భారతదేశం నుండి వ్యతిరేకత నెలకొందని అన్నారు. ప్రియాంకతో కలిసి పని చేయవద్దని సినీ పరిశ్రమలోని ప్రముఖులు హెచ్చరించారని.. ఆమె ఎప్పుడూ నటిగా పనికి రాదని.. మీ విలువైన సమయాన్ని ఎందుకు వృథా చేసుకుంటున్నారో తెలీదు! అని హెచ్చరించారని వెల్లడించింది.

అంజులా మాట్లాడుతూ-''నేను న్యూయార్క్ లోని ఒక స్నేహితుడి ఇంట్లో కొందరు ప్రముఖులతో కలిసి ఒక విందులో ఉన్నాను. నేను బాలీవుడ్ అని చెప్పను.. ఎందుకంటే వారు ఆ పదాన్ని ద్వేషిస్తారు. కాబట్టి వారు హిందీ చిత్ర పరిశ్రమను ద్వేషిస్తారు. పార్టీలో వారంతా చాలా ప్రతికూలంగా ఉన్నారు. పీసీ గురించి మాట్లాడుతూ..ఆమె ఎప్పుడూ పని చేయలేదు.. మీరు మీ సమయాన్ని ఎందుకు వృధా చేస్తున్నారో నాకు తెలియదు.. బ్లా.. బ్లా..బ్లా'' అని వ్యాఖ్యానించారు.

ఈ వ్యాఖ్యలు తనను బాధించాయని అంజుల అన్నారు. నేను నా సమయాన్ని వృధా చేస్తున్నానా? అనే ప్రశ్న నాకు ఇంకా గుర్తుంది. కానీ ఇక్కడే మనలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇది ఒక వెర్రి కలలా అనిపించింది. భారతదేశం నుండి హాలీవుడ్ కు ఎవరినైనా తీసుకురావాలా? అని ఆలోచించాను. కానీ నేను ప్రియాంక కళ్లలోకి చూసినప్పుడు నమ్మకం కలిగింది. ప్రియాంక కాదనలేని పరిస్థితి. ఆమె ఆటంకం కలిగించలేదు!.. అని గతాన్ని గుర్తు చేసుకున్నారు.

అంజులా మొదట్లో ప్రియాంకను సింగర్ గా అమెరికాలో లాంచ్ చేయాలని ప్లాన్ చేసింది. కానీ ఆ వ్యూహం ఫలించకపోవడంతో.. ప్రియాంక టెలివిజన్ షో క్వాంటికోలో ఒక పాత్రను పోషించింది. ది మ్యాట్రిక్స్ రివల్యూషన్స్- బేవాచ్ - ది వైట్ టైగర్ వంటి చిత్రాలలో అవకాశాలు అందుకుంది. ఇప్పుడు హాలీవుడ్ లో పీసీ పాపులర్ స్టార్. త్వరలో జో అండ్ ఆంథోనీ రస్సో నిర్మించిన ఎగ్జిక్యూటివ్ 'సిటాడెల్' అనే భారీ-బడ్జెట్ సిరీస్ లో అలరించనుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.