వెరైటీ లుక్ తో మైండ్ బ్లాక్ చేసిన పీసీ

Sat Jan 15 2022 07:00:01 GMT+0530 (IST)

Priyanka Chopra Latest Photo

గ్లోబల్ ఐకాన్ ప్రియాంక చోప్రా ఇటీవలి కాలంలో రకరకాల ఫోటోషూట్లతో అంతర్జాలంలో టాప్ ట్రెండ్స్ లో నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వాటన్నిటినీ మించి తగ్గేదేలే! అంటూ మరో ఫోటోషూట్ తో దూసుకొచ్చింది. ప్రఖ్యాత వానిటీ ఫెయిర్ మ్యాగజైన్ కోసం అద్భుతమైన కవర్ స్టార్ గా తనను తాను ఎలివేట్ చేసుకుంది ఈ బ్యూటీ. పీసీ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోల బంచ్ అంతర్జాలాన్ని షేక్ చేస్తోంది.
వానిటీ ఫెయిర్ అధునాతన ఫోటోగ్రఫీ డెప్త్ ప్రత్యేకంగా ఆకట్టుకుంటోంది. అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన పత్రిక దాని స్థాయికి తగ్గ ఫోటోషూట్ తో బరిలో దిగింది. ఫిబ్రవరి 2022 ఎడిషన్ కోసం పీసీ తో మైండ్ బ్లాక్ చేసే ఫోటోషూట్ ని ప్లాన్ చేసిందని ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.ఈ షూట్ కోసం పీసీ ఎంతో ఖరీదైన విలాసవంతమైన ఫ్యాషన్ దుస్తులను ధరించింది. ఫ్యాషన్ లో తనదైన మార్గాన్ని ఆవిష్కరిస్తూ అందరి దృష్టిని ఆకర్షించింది.  ప్రధాన ముఖచిత్రం 1920ల నాటి డిజైనర్ లుక్ ని కలిగి ఉన్న ఆఫ్-షోల్డర్ వైట్ కాక్ టెయిల్ గౌన్ తో కనిపించింది. ముదురు లిప్ స్టిక్.. డస్కీ స్కిన్ షోతో పీసీ ఎంతో ప్రత్యేకంగా కనిపించింది ఓ ఫోటోగ్రాఫ్ లో. ఫోటోగ్రఫీ ఆద్యంతం ఎంతో క్రియేటివ్ గా ఆకట్టుకుంది. పీసీ మునుపెన్నడూ చూడని అవతారాలతో అందర్నీ ఆశ్చర్యపరిచింది. ప్రియాంక స్ట్రాప్ లెస్ రెడ్ డ్రెస్ .. గ్రీన్ ప్యాంట్ సూట్ లోనూ మెరిసింది. పోల్కా-చుక్కల వస్త్రధారణ.. మోనోక్రోమ్ దుస్తులతో మెరుపులు మెరిపించింది. ఓవరాల్ గా పీసీ అందాన్ని పదింతలు పెంచింది ఈ ఫోటోషూట్.