జీవితం సాగాలి హాయిగా మత్తుగా..

Wed Sep 26 2018 15:46:13 GMT+0530 (IST)

Priyanka Chopra In Relaxed Mood

నే తాగితే లోకమే ఊగదా.. లలల హాయ్ హాయ్.. ఆల్కహాల్ గ్లాస్ తో ఆనాటి `మిస్సమ్మ` హడావుడి అంతా ఇంతా కాదు. తాగాలి.. తాగి ఊగాలి. అదీ నేటి మిస్సమ్మ ఫార్ములా. ప్రస్తుత సెలబ్రిటీ ప్రపంచం తీరు తెన్నులు అలానే ఉంది మరి. మందేసి చిందేస్తే వచ్చే ఆ కిక్కును ఆస్వాధించడంలో బాలీవుడ్ కథానాయికల స్పీడ్ గురించి ఏమంత కొత్తగా చెప్పుకోవాల్సిన పనేలేదు. మ్యాంగో జూస్ .. బత్తాయ్ జ్యూస్ తాగినంత సింపుల్ గా 40-80 % ఆల్కహాల్ ఉండే రమ్ ను గ్లాస్ లోంచి గొంతులో ఒంపేయగలరు.ఇదిగో విదేశాల్లో చిత్తు చిత్తుగా ఎంజాయ్ చేస్తున్న పీసీ ని చూశారా?  చేతిలో జ్యూస్ గ్లాస్.. అది కూడా ట్రావెలింగ్ లో. ఓ ఖరీదైన కార్ లో రయ్ మని దూసుకెళుతూనే ఎంత రిలాక్స్ డ్ గా ఎలా వాలి పోయిందో. ఓవైపు మత్తుగా జోగిపోతూనే చిత్తుగా పెగ్గేస్తోందేమో.. అన్న సందేహాలొస్తున్నాయ్. అయితే ఆ గ్లాస్‌లో ఉన్నది కేవలం ఫ్రూట్ జ్యూస్ మాత్రమేనా?  లేక అందులో ఏవైనా రమ్ - విస్కీ - ఓడ్కా కలిసిందా? అంటూ యూత్ తెగ ఆరాలు తీస్తున్నారు.

ఇంతకీ ఇదెక్కడ? అంటే.. ఇటీవలే అంబానీ వెడ్డింగ్ కి ఇటలీ -లోక్ హోమో వెళ్లిన పీసీ అక్కడ ఎల్లో ఫ్లవర్ డ్రెస్ లో ఫోటోషూట్ లో పాల్గొంది. అది పూర్తి చేసుకుని - అటుపై రిటన్ వస్తూ ఇలా కార్ లోనే చిలౌట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు అంతర్జాలంలో వేడి పెంచుతున్నాయ్.  రన్నింగ్ కార్ లోనూ అంతే ఇదిగా లైఫ్‌ని ఎంజాయ్ చేయడం చూస్తుంటే బాండ్ గాళ్ గుర్తుకు రావడం లేదూ?  పీసీ ఇప్పుడు హాలీవుడ్ వినువీధుల్లో లేడీబాండ్ 007 తరహాలో చెలరేగిపోవడం చూస్తుంటే ఇక ఇండియాకి వస్తుందో రాదో.. ఇంతకీ ఆ కార్ డ్రైవ్ చేస్తోందెవరో.. నిక్ జోనాస్ అయ్యుండొచ్చేమో.. ప్చ్!!