Begin typing your search above and press return to search.

షూటింగ్ లో గాయం.. ఆసుపత్రితో ప్రియాంక

By:  Tupaki Desk   |   14 Jan 2017 6:03 AM GMT
షూటింగ్ లో గాయం.. ఆసుపత్రితో ప్రియాంక
X
బాలీవుడ్ భామ.. మొన్నీ మధ్యనే అవార్డుల ఫంక్షన్ మెరుపులా మెరిసిన ప్రియాంకాచోప్రా తాజాగా గాయపడ్డారు. క్వాంటికో సీరియల్ చేస్తున్న ఈ భామ షూటింగ్ లో భాగంగా తాజాగా గాయపడ్డట్లు తెలుస్తోంది. తల భాగంలో తగిలిన దెబ్బతో స్పృహ కోల్పోయిన ఆమెను.. హుటాహుటిన ఆసుపత్రికి తరలించినట్లుగా తెలుస్తోంది.

ఏబీసీ సీరిస్ అయిన క్వాంటికో షూటింగ్ లో భాగంగా ఒక యాక్షన్ సీన్ ను చిత్రీకరించే సమయంలో ప్రియాంక గాయపడిందని.. ఆ వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. చికిత్స చేసిన వైద్యులు.. ప్రస్తుతం ఆమెకు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ఈ వారాంతం తర్వాత మాత్రమే ఆమె మళ్లీ షూటింగ్ కు హాజరయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/