అమెరికా కోడలు నాభి రింగు సోకు

Wed Apr 17 2019 13:55:53 GMT+0530 (IST)

Priyanka Chopra Flashes Her Belly Ring During Stylish Outing

రోమ్ వెళితే రోమన్ లా ఉండాలని అంటారు! అమెరికా కోడలు ప్రియాంక చోప్రా తూ.చ తప్పక దానిని ఫాలో అవుతున్నారా? అంటే అవుననే ఈ కొత్త లుక్ చూస్తే అర్థమవుతోంది. హాలీవుడ్ వెళ్లాక హాలీవుడ్ స్టార్స్ అనుకరించే అన్ని రకాల పిచ్చి ఫ్యాషన్స్ ను పీసీ ఫాలో అవుతోంది. బాలీవుడ్ లో కనిపించినప్పటి కంటే అల్ట్రా మోడ్రన్ స్టైల్ ని అనుసరిస్తూ యువతరంలో నిరంతరం హాట్ టాపిక్ అవుతోంది. నిక్ జోనాస్ లాంటి క్రేజీ సింగర్ వైఫ్ గా తన రేంజును ఏమాత్రం తగ్గించడం లేదు పీసీ.మాజీ విశ్వసుందరిగా మారతున్న ట్రెండ్ ని అనుసరించడం తనకు కొత్తేమీ కాకపోయినా పాశ్చాత్య దేశాల్లో వైఖరి వేరు కదా? అందుకే ఫ్యాషన్ & ట్రెండ్స్ లో ప్యారిస్ కే పాఠాలు నేర్పించే రేంజుకి పీసీ ఎదిగేసింది. అంతర్జాతీయ స్థాయి మీడియాల్లో లైవ్ కార్యక్రమాలకు వెళ్లినప్పుడు ఒకలా.. మ్యాగజైన్ ఫోటోషూట్లలో ఇంకోలా.. అత్తారింట్లో ఉన్నప్పుడు వేరొకలా.. వీధుల్లో షికార్లు చేసినప్పుడు ఇంకేదైనా కొత్త లుక్ లో కనిపిస్తూ నిరంతరం వేడెక్కిస్తోంది.

36 ఏళ్ల ప్రియాంక చోప్రా మరోసారి వేడెక్కించే తాజా లుక్ తో అభిమానుల్లో హాట్ టాపిక్ అయ్యింది. ఈసారి టైట్ ఫిట్ డెనిమ్ జీన్స్.. ఆ పైన సింపుల్ వైట్ నెక్ టాప్.. దానిపైన లాంగ్ కోట్ తో దర్శనమిచ్చింది. వైట్ టాప్ పై గళ్ల కోటు సంథింగ్ స్పెషల్ గా కనిపిస్తోంది. కూల్ గ్లాసెస్ ధరించి.. చెదిరిపోయిన ఆ తలనీలాల్ని సవరించుకుంటోంది పీసీ. చేతిలో బ్లాక్ డఫెల్ బ్యాగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వీటన్నిటినీ మించి డెనిమ్ కి కాస్త అప్ లో నాభి కేంద్రంపైకి యూత్ కళ్లు తిప్పేయడం మరో హైలైట్. ఆ నాభికి ప్రత్యేకించి ఓ రింగును కుట్టించుకుంది పీసీ. ఇలాంటి ఫ్యాషన్స్ హాలీవుడ్ సినిమాల్లోనే రెగ్యులర్ గా చూస్తుంటాం. బాలీవుడ్ లో అలాంటి ఫీట్ వేయలేదు కానీ.. ప్రస్తుతం అమెరికా కోడలిగా హాలీవుడ్ స్టార్ గా ఈ కొత్త లుక్ కి మారిందని భావించవచ్చు!! ఇంట్రెస్టింగ్.