Begin typing your search above and press return to search.
RRR తమిళ సినిమా అంటూ అవమానించింది!
By: Tupaki Desk | 29 March 2023 4:03 PMరామ్ చరణ్ సరసన `జంజీర్` రీమేక్ లో నటించింది ప్రియాంక చోప్రా. బిగ్ బి అమితాబ్ నటించిన మేటి క్లాసిక్ సినిమా జంజీర్ రీమేక్ అప్పట్లో నిరంతరం చర్చల్లో నిలిచేది. ఈ సినిమా `తుఫాన్` పేరుతో తెలుగులో విడుదలైంది. హిందీలో రామ్ చరణ్ తొలి ఎటెంప్ట్ లోనే గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా సరసన నటించారు. ఆ సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా కానీ ఇప్పుడు ఆర్.ఆర్.ఆర్ తో పాన్ వరల్డ్(ఇండియా) స్టార్ గా ఓ వెలుగు వెలుగుతున్నాడు రామ్ చరణ్.
ఇలాంటి సమయంలో ఓ పబ్లిక్ ప్లాట్ ఫామ్ పై మాట్లాడుతూ ప్రియాంక చోప్రా RRRని తమిళ సినిమా అని వ్యాఖ్యానించడం తీవ్ర దుమారం రేపుతోంది. చరణ్ అభిమానులు ఈ వ్యాఖ్యలపై తీవ్రంగా మండి పడుతున్నారు. ఆర్.ఆర్.ఆర్ తెలుగు సినిమానా లేక తమిళ సినిమానా .. హిందీ సినిమానా? అన్నదానిపై క్లారిటీ లేకుండా మాట్లాడిందా? అంటూ సోషల్ మీడియాల్లో జోరుగా కౌంటర్లు పడిపోతున్నాయ్.
అది కూడా RRRని బాలీవుడ్ చిత్రం అని వ్యాఖ్యానించిన ప్రముఖ ఆంగ్ల చానెల్ వ్యాఖ్యాత డాక్స్ షెపర్డ్ తప్పును ప్రియాంక చోప్రా సరిదిద్దుతూ తాను మరీ ఇలాంటి ఘోరమైన తప్పును మాట్లాడింది. దీనిని చరణ్ అభిమానులు నిజంగానే సహించలేకున్నారు. ఇటీవల ఆస్కార్ గెలుచుకున్న RRR ని పీసీ తమిళ చిత్రం అని భావిస్తోందా? అంటూ కౌటర్లు పడిపోతున్నాయ్.
భారతీయ చలనచిత్ర పరిశ్రమ ఎలా అభివృద్ధి చెందుతోందనే దానిపై ప్రశంసలు కురిపిస్తూ RRR మా ఎవెంజర్స్ లాంటిది! అని చెప్పిన పీసీ అంతలోనే ఇది తమిళ సినిమా అని వ్యాఖ్యానించడం డైజెస్ట్ కావడం లేదు. ఇంటర్వ్యూలో ప్రియాంక - షెపర్డ్ ఇరువురూ బాలీవుడ్ సహా భారతీయ చలనచిత్ర పరిశ్రమలో మారుతున్న డైనమిక్స్ గురించి చర్చించుకోగా ఈ తప్పిదం దొర్లింది.
RRR పెద్ద మెగా బ్లాక్ బస్టర్... తమిళ చిత్రమిది.. ఇది అవెంజర్స్ లాంటిది`` అని ఆమె తప్పును పునరావృతం చేసింది. కొద్దిసేపటికే ఆ వ్యాఖ్య ఇంటర్నెట్ లో వైరల్ అయ్యింది. నెటిజన్లు పీసీని ట్రోల్ చేసారు. RRR బాలీవుడ్ సినిమా లేదా తమిళ సినిమా కాదు.. ఇది తెలుగు సినిమా అని నెటిజనులు సరిదిద్దే ప్రయత్నం చేసారు.
ఈ సంవత్సరం ఆర్.ఆర్.ఆర్ ఆస్కార్ ను గెలుచుకున్నప్పుడు దర్శకనిర్మాత SS రాజమౌళిని RRR మొత్తం బృందాన్ని ప్రశంసించిన వారిలో పీసీ ఒకరు. RRR స్టార్ రామ్ చరణ్ అతని భార్య ఉపాసన కోసం పీసీ ప్రీ ఆస్కార్ విందును కూడా నిర్వహించింది. అంతే కాదు.. తన స్నేహితులు కుటుంబ సభ్యుల కోసం లాస్ ఏంజిల్స్ లో ఆర్.ఆర్.ఆర్ ప్రత్యేక స్క్రీనింగ్ ను కూడా నిర్వహించింది. RRR `నాటు నాటు...` గీతం ఉత్తమ ఒరిజినల్ సాంగ్ గా అకాడమీ అవార్డును గెలుచుకుంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.