పిల్లలంటే ఇష్టంతో పెళ్లికి ముందే ఆ పని చేసిందట!

Fri Mar 31 2023 14:00:01 GMT+0530 (India Standard Time)

Priyanka Chopra About Freezing Her Eggs

గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా తాజాగా నటించిన సిటాడెల్ వెబ్ సిరీస్ ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా మీడియాలో సందడి చేస్తోంది. ఈ వెబ్ సిరీస్ లో రొమాంటిక్ సన్నివేశాల్లో కనిపించడంతో పాటు విభిన్నమైన పాత్రలో తాను కనిపించబోతున్నట్లుగా ప్రియాంక చోప్రా పేర్కొంది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో బాలీవుడ్ పై సంచలన ఆరోపణలు చేసి వార్తల్లో నిలిచిన ప్రియాంక చోప్రా తాజాగా సరోగసి విధానం పై మరియు తన పిల్లల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.



తనకు పిల్లలంటే చాలా ఇష్టమని.. వయసు పెరుగుతున్నా కొద్దీ పిల్లలు కలిగే అవకాశం తక్కువ ఉంటుందనే ఉద్దేశంతో పెళ్లి కాక ముందే తన అండాలను దాచి పెట్టానని పేర్కొంది.

ప్రియాంక చోప్రా గైనకాలజిస్ట్ అయిన తన తల్లి మధు చోప్రా సలహా మేరకు ఈ పని చేసిందట. అండాలను దాచి పెట్టిన ప్రియాంక చోప్రా ఎవరితో పిల్లలని కనాలి అనే విషయమై ఆ సమయంలో క్లారిటీ లేకపోవడంతో ఇన్నాళ్లు వెయిట్ చేసిందట.

30 సంవత్సరాల వయసులోనే తాను అండాలను దాచి పెట్టాను.. అలా చేయడం వల్ల కెరియర్ లో నాకు పూర్తి స్వేచ్ఛ లభించింది. వర్క్ లో తాను ముందుకు సాగాను.. అనుకున్నది సాధించగలిగాను. ఉన్నత లక్ష్యాలను సాధించగలిగాను అంటూ ప్రియాంక చోప్రా పేర్కొంది.

తన భర్త నిక్ జోనస్ వయసు తక్కువ ఉండడం వల్ల అతడితో పిల్లలు కనడం కష్టం అంటూ కొందరు కామెంట్స్ చేశారు... అలాగే నిక్ వయసు పెళ్లి సమయంలో చాలా తక్కువ.

కనుక చిన్న వయసులోనే పిల్లలకు ఓకే చెప్తాడో లేదో అని అనుకున్నాను. అందుకే వెంటనే డేటింగ్ కి ఒప్పుకోలేదని ప్రియాంక చోప్రా పేర్కొంది. ప్రస్తుతం మాతృత్వాన్ని ఆస్వాదిస్తున్నానని ప్రియాంక చోప్రా చెప్పుకొచ్చింది.         


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.