Begin typing your search above and press return to search.

ప్రియాంక చోప్రా ఇంటికి తిరిగెళ్లిపోదామ‌నుకున్న రోజుల‌వి!

By:  Tupaki Desk   |   29 May 2023 11:36 AM GMT
ప్రియాంక చోప్రా ఇంటికి తిరిగెళ్లిపోదామ‌నుకున్న రోజుల‌వి!
X
నేడు బాలీవుడ్ న‌టి ప్రియాంక చోప్రా ఏ స్థాయికి చేరుకుందో తెలిసిందే. బాలీవుడ్ ని దాటి హాలీవుడ్ కెళ్లి గ్లోబ‌ల్ స్టార్ అయింది. ప్ర‌పంచ‌మే త‌న‌ని మెచ్చే స్థాయికి చేరుకుంది. ఈ క్ర‌మంలో ఎన్నో స‌వాళ్లు ఎదుర్కుం ది. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా బాలీవుడ్ కొచ్చింది. ఈ నేప‌థ్యంలో నిల‌దొక్కుకోవ‌డానికి ఎంత‌గా శ్ర‌మించాల్సి వ‌చ్చింద‌న్నది ఈ మ‌ధ్య‌నే పీసీ రివీల్ చేసింది. ఎదిగే క్ర‌మంలో ప‌రిశ్ర‌మ‌లో ఎలాంటి ప‌రిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది? మ‌హిళ‌ల ప‌ట్ల లైంగిక వేధింపులు వంటివి ఎలా ఉంటాయి? వంటి ప‌రిస్థితుల్ని వివ‌రించింది.

తాజాగా రెండు ద‌శాబ్ధ‌ల జ‌ర్నీని పుర‌స్కరించుక‌ని అమ్మ‌డు మ‌రిన్ని ఆస‌క్తిక‌ర సంగ‌తులు తెలిపింది. కెరీర్ మొద‌లైన కొత్త‌లో వైఫ‌ల్యాలు ఎదురైన‌ప్పుడు సినిమాకి భారంగా మారును అని తెగ ఫీల‌య్యేద‌ట‌. ప్ర‌తీ చిన్న విష‌యాన్ని భూత‌ద్దంలో పెట్టి చూసేదిట‌.

ఏదైనా మంచి అవ‌కాశం వ‌చ్చినా.. న‌టించిన సినిమా ఫెయిలైనా? వీప‌రీతంగా బాధ ప‌డేదాన్ని. అదంతా నా వైఫ‌ల్య‌మేన‌ని కుచించుకుపోయేదాన్ని. న‌టించాలా? వ‌ద్దా? అని సందేహ ప‌డేదాన్ని. ముఖ్యంగా నా కెరీర్ మొద‌లైన కొత్త‌లో నాకు ఎవ‌రూ పెద్ద‌గా తెలియ‌దు.

పెద్ద స్టార్ల‌తో క‌లిసి న‌టించాలంటే భ‌యం. ఇది చూసి తిరిగి ఇంటికెళ్లిపోదామ‌ని పించింది. అప్పుడు ప‌రిశ్ర‌మ‌లో ప‌రిస్థితులు కూడా స‌రిగ్గా లేవు. అయితే త‌ర్వాత ప‌రిస్థితి అర్ధ‌మైంది. ఇలా ఉంటే ముందుకెళ్ల లేమ‌ని తెలుసుకున్నా.

ముందుగా న‌న్ను నేను మార్చుకోవా ల‌ని బ‌మ‌లైన నిర్ణ‌యం తీసుకున్నా. విష‌యం బ్ట‌టి ఏది సీరియ‌స్ గా తీసుకోవాలి. ఏది లైట్ తీసుకోవాలి అన్న‌ది అప్పుడే అర్ధం చేసుకున్నా. ఇక్క‌డ న‌టించ‌డం త‌ప్ప గెలుపోట‌ములు ప‌ట్టించుకో కూడ‌ద‌ని తెలుసుకున్నాను.

అప్ప‌టి నుంచి యాక్టింగ్ ఎంజాయ్ చేస్తున్నా. ఆ త‌ర్వాత నును భ‌య‌ప‌డిన‌వ‌న్నీ త‌లుచుకుంటే చాలా సిల్లీగా అనిపంచ‌డం మొద‌లైంది. కెరీర్ కొత్త‌లో ఎవ‌రైనా అలాగే ఫీలవుతారు. అందుకే ఏదైనా ప్ర‌యాణ‌మం మొద‌లు పెట్టే ముందే దాని గురించి కొంత అవ‌గాహ‌న చేసుకోవ‌డం మంచింది. అనుభ‌వ‌జ్ఞులు అందుకనే? ఏ విష‌యంపైనైనా కాస్త సీరియ‌స్ గా ఉంటార‌ని అప్పుడే అర్ధ‌మైంది' అని తెలిపింది.