స్టేజిపై తడబడిన ప్రియాంక!

Wed Sep 11 2019 13:45:47 GMT+0530 (IST)

Priyanka Arul Mohan At Nani Gang Leader Pre Release Event

న్యాచురల్ స్టార్ నాని కొత్త సినిమా 'గ్యాంగ్ లీడర్' ప్రీరిలీజ్ ఈవెంట్ నిన్న వైజాగ్ లో జరిగిన సంగతి తెలిసిందే. ఫుల్ జోష్ ఉండే క్రౌడ్..  మైక్ కు క్షణం కూడా విరామం ఇవ్వకుండా తాటతీసే హోస్టు సుమ కార్యక్రమాన్ని సూపర్ సక్సెస్ చేశారు.  అయితే అందరూ సుమలాగా గలగల పారే గోదారిలా మాట్లాడలేరు కదా.  హీరోయిన్ ప్రియాంక ఆరుళ్ మోహన్ కు సరిగ్గా అలాంటి ఇబ్బందే ఎదురైంది.సుమ ఉత్సాహంగా మాట్లాడుతూ "ఆ యూత్ లో జోష్ చూడండి.  కొత్త హీరోయిన్లను ఎంతో ఆదరిస్తారు.. ఇప్పుడు ప్రియాంక  మాట్లాడుతుంది" అంటూ ఒక మైక్ ఇచ్చింది.  అసలే పెద్ద క్రౌడ్ ను చూసి ప్రియాంక టెన్షన్ పడుతుంటే.. దానికి తగ్గట్టుగా ప్రియాంక చేతిలో ఉన్న మైక్ సరిగా పని చేయలేదు.. ప్రియాంక గొంతు తక్కువ వాల్యూం లో వినిపించింది.  సుమ కలుగజేసుకొని తన మైక్ ప్రియాంకకు ఇచ్చింది.  ప్రియాంక స్పీచ్ మొదలు పెట్టే  సమయంలో నెర్వస్ గా కనిపించింది.  చాలా పెద్ద స్పీచ్ ప్రిపేర్ చేసుకొని వచ్చానని అయితే నోట మాట రావడం లేదని.. నెర్వస్ గా ఉందని ప్రియాంక ఒప్పుకుంది.  అలా అని స్పీచ్ ని ముగించకుండా ఎలాగో నాలుగు నిముషాలు మాట్లాడింది. అందరికీ కృతజ్ఞతలు చెప్పింది.

ప్రియాంక స్పీచ్ మొదట్లో తడబడ్డా మెల్లగా కొంచెం రిథం రావడంతో  కొంచెం ఫ్లోలో మాట్లాడింది. ఎక్కువ మంది క్రౌడ్ ఉన్నప్పుడు ఇలా జరగడం సహజమే. అయితే తన అందమైన డ్రెస్సుతో.. క్యూట్ గా ఉండే కొంచెం కొంచెం తెలుగుతో అందరినీ క్లీన్ బౌల్డ్ చేసింది.  గ్యాంగ్ లీడర్ 13 న రిలీజ్ అవుతోందని.. మీ గ్యాంగ్ తో థియేటర్ కు వెళ్లి చూడాలని కోరుతూ.. పైరసీ ని ప్రోత్సహించవద్దని కూడా ఒక రిక్వెస్ట్ చేసింది.