Begin typing your search above and press return to search.

వింక్ గాళ్‌ భంగ‌పాటు.. ఎంత‌ అవ‌మానం!

By:  Tupaki Desk   |   23 Feb 2020 9:43 AM GMT
వింక్ గాళ్‌ భంగ‌పాటు.. ఎంత‌ అవ‌మానం!
X
వింక్ గాళ్‌ ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్ సెన్సేష‌న్స్ గురించి తెలిసిందే. ఈ అమ్మ‌డు న‌టించిన మ‌ల‌యాళ డెబ్యూ చిత్రం `ఒరు ఆధార్ ల‌వ్` తెలుగులో ల‌వ‌ర్స్ డే పేరుతో రిలీజైంది. ఈ చిత్రంలో క‌న్నుగీటి కుర్ర‌ హృద‌యాల్ని కొల్ల‌గొట్టిన ప్రియా.. సోష‌ల్ మీడియాలో ఎంత‌టి సంచ‌ల‌నాలకు తెర తీసిందో చెప్పాల్సిన ప‌నే లేదు. స‌న్నీలియోన్ ని మించిన ఫాలోయింగ్ తెచ్చుకుని సెన్సేష‌న్ అయ్యింది. నెటింట్లో వింక్ బ్యూటీ పాపులారిటీ అమాంతం పెరిగింది. ఆ క్రేజ్ తో వ‌రుస‌గా సినిమా అవ‌కాశాలు అందిపుచ్చుకుంది. బాలీవుడ్ సైతం అమ్మ‌డి వైపు ఓ లుక్ వేసింది. బ్రాండ్ అంబాసిడ‌ర్ గా నాలుగు చేతులా ఆర్జించింది.

`ఒరు అధార్ ల‌వ్` బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా కొట్టినా యూత్ లో ఫాలోయింగ్ మాత్రం త‌గ్గ‌లేదు. ఇక బాలీవుడ్ లో ఈ భామ న‌టించిన శ్రీ‌దేవి బంగ్లా ఇప్ప‌టికీ రిలీజ్ కాక‌పోవ‌డం కోర్టు వివాదాల్లో చిక్కుకోవడం తెలిసిందే. ఆ క్ర‌మంలోనే ప్రియా కెరీర్ పై కొంత సందిగ్ధ‌త త‌ప్ప‌లేదు. ఇటీవ‌ల సోష‌ల్ మీడియాలో మాత్రం ఫాలోయింగ్ త‌గ్గ‌కుండా జాగ్ర‌త్త ప‌డుతోంది. తాజాగా ఇన్ స్టాలో ప్లైయింగ్ కిస్సులు విసురుతున్న వీడియోతో ఫ్యాన్స్ ను ఆక‌ర్షించే ప్ర‌య‌త్నం చేసింది ఈ భామ‌. కానీ ప్రియా ప‌ప్పులేవీ ఉడ‌క‌లేదు. వింక్ గాళ్ సోష‌ల్ మీడియా ఫాలోవ‌ర్స్ ల‌క్ష‌ల్లో ఉన్నా....ఈ ప్లైయింగ్ కిస్సు కేవ‌లం 3ల‌క్ష‌ల‌ మందికే రీచ్ అయింది. దీంతో ప్రియాని అంద‌రూ లైట్ తీస్కున్నార‌నే అర్థ‌మ‌వుతోంది. సోష‌ల్ మీడియాలో క్రేజీగా దూసుకెళ్లాల‌ని అనుకున్నా.. ఆ ప్ర‌య‌త్నం ఎందుక‌నో వ‌ర్కౌట్ అవ్వ‌లేదు.

ప్ర‌స్తుతం నితిన్ స‌ర‌స‌న వింక్ గాళ్ ఓ క్రేజీ ఆఫ‌ర్ అందుకుంద‌న్న‌ ప్ర‌చారం ఉంది. వెట‌ర‌న్ డైరెక్ట‌ర్ చంద్రశేఖ‌ర్ ఏలేటి ద‌ర్శ‌క‌త్వంలో నితిన్ స‌ర‌స‌న రెండో నాయిక‌గా ఈ బ్యూటీనీ ఎంపిక చేసిన‌ట్లు కొంత‌కాలంగా ప్ర‌చారం ఉంది. ప్ర‌ధాన నాయిక‌గా ఇప్ప‌టికే ర‌కుల్ ప్ర‌తీసింగ్ ని ఎంపికైంది. ప్రియా రోల్ ఈ సినిమాలో ఎంత‌సేపు అన్న‌ది వెల్లడి కావాల్సి ఉంది.

వీడియో కోసం క్లిక్ చేయండి