Begin typing your search above and press return to search.

వీడియో: వింక్ గాళ్ `ల‌డీ ల‌డీ` స్టెప్పులు ఇర‌గ‌దీసిందిగా

By:  Tupaki Desk   |   14 Jan 2021 6:26 AM GMT
వీడియో: వింక్ గాళ్ `ల‌డీ ల‌డీ` స్టెప్పులు ఇర‌గ‌దీసిందిగా
X
మాంచి జోష్ ఉన్న అవ‌కాశం రావాలే కానీ ఎందులోనూ నేటిత‌రం తార‌లు త‌గ్గ‌డం లేదు. మ‌ల‌యాళ సినిమా `ఒరు ఆధార్ ల‌వ్` లో ఆరంగేట్ర‌మే వింక్ యాక్ట్ తో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్. ఆ త‌ర్వాత‌ హిందీలో వివాదాస్ప‌ద‌ చిత్రం `బూత్ బంగ్లా`తో జాతీయ స్థాయిలో టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. ఆ రెండు సినిమాల త‌ర్వాత తెలుగులో నితిన్ స‌ర‌స‌న ఓ ఛాన్స్ అందుకుంది.

ఈ లాక్ డౌన్ సీజ‌న్ లో సోష‌ల్ మీడియా వేదిక‌గా అంద‌రి దృష్టిని ఆక‌ర్షించేలా వ‌రుస ఫోటోషూట్ల‌తో వీడియో షూట్ల‌తో దూసుకొచ్చింది ప్రియా. దీంతో పాటే .. ఓ ప్ర‌యివేట్ ఆల్బ‌మ్ తోనూ బరిలో దిగింది. రోహిత్ నందన్- ప్రియా ప్రకాష్ వారియర్ జంట‌గా రూపొందిన `లడీ లడీ` ప్రైవేట్ సాంగ్ సంక్రాంతి కానుక‌గా విడుదలైంది. ప్రియాకి ఇదే తొలి ప్ర‌యివేట్ పాట‌.

ఈ పాట‌కు ప్రముఖ కొరియోగ్రాఫర్ రఘు మాస్టర్ కొరియోగ్ర‌ఫీ స‌మ‌కూర‌చ్చ‌గా రాహుల్ సిప్లిగంజ్ ఈ పాటను పాడారు. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించిన ఈ పాటకు విస్సాప్రగడ లిరిక్స్ అందించారు. పబ్ లో పక్కా మాస్ బీట్ లో సాగిపోయే ఈ పాటలో ప్రియా స్టెప్స్ లో హుషారు ఆక‌ట్టుకుంది. పాట‌లో కొరియోగ్ర‌ఫీ పాత హిందీ ఆల్బ‌మ్స్ కి రీమిక్స్ లా అనిపించినా.. లీడ్ పెయిర్ స్టెప్పులు జోష్ పెంచాయి. య‌థావిధిగా ప్రియా సంథింగ్ హాట్ లుక్ తో క‌వ్వించింది.