ఆయన ఇచ్చిన రూ.300 ఇంకా నా వద్ద ఉన్నాయి

Fri Jun 18 2021 23:00:01 GMT+0530 (IST)

Priya Mani Talking About Shahrukh Khan

సౌత్ తో పాటు నార్త్ లో కూడా హీరోయిన్ గా మంచి గుర్తింపు దక్కించుకున్న ప్రియమణి ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ను కొనసాగిస్తూ ఉంది. బుల్లి తెర మరియు వెండి తెర ఇలా అన్ని చోట్ల కూడా సందడి చేస్తోంది. తెలుగులో ఈమె నారప్ప మరియు విరాట పర్వం మరియు చిత్రాల్లో ఈమె కీలక పాత్రల్లో నటించింది. త్వరలోనే ఆ సినిమా లు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఇక ఈమె ఇటీవల నటించిన ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 వెబ్ సిరీస్ అమెజాన్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ది ఫ్యామిలీ మ్యాన్ లో ఈమె పాత్రకు మంచి గుర్తింపు దక్కింది. ఇటీవల ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను వెళ్లడించింది.చెన్నై ఎక్స్ ప్రెస్ సినిమా లో ప్రియమణి ఒక పాటలో కనిపించింది. ఆ సమయంలో షారుఖ్ ఖాన్ తో వర్క్ ఎక్స్ పీరియన్స్ గురించి ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. షారుఖ్ ఖాన్ తో నటించిన అనుభవంను ఎప్పటికి మర్చి పోలేను అంటూ చెప్పుకొచ్చింది. ఆయన తో వర్క్ చాలా కంఫర్ట్ బుల్ గా ఉంటుందని.. సెట్ లో అందరి తో కూడా ఆయన చాలా సరదాగా ఉంటాడని చెప్పుకొచ్చింది. షారుఖ్ ఖాన్ తో వర్క్ సమయంలో ప్రతి ఒక్కరు కూడా చాలా సరదాగా ఉంటారు. ఆయన సెట్ లో చాలా సరదాగా ఉండేది.

సెట్ లో ఆయన ఐ పాడ్ లో కౌన్ బనేగా కరోడ్ పతీ ఆడేవాళ్లం. ఆ సమయంలో నాకు ఆయన రూ.300 ఇచ్చారు. ఆ మూడు వందల రూపాయలను ఇప్పటికి నా వద్ద అలాగే పెట్టుకున్నాను. అంతటి మంచి వ్యక్తి షారుఖ్ అంది. ఆయన అందరితో కూడా ఒకేలా ఉంటారు. సెట్ లో ఆయన ఉన్న సమయంలో సందడి వాతావరణం ఉంటుందని ఈ సందర్బంగా ఆమె చెప్పుకొచ్చింది.