Begin typing your search above and press return to search.

మేలో థియేట‌ర్ల లాక్ డౌన్ తో జూన్-జూలైకి ఒత్తిడి!

By:  Tupaki Desk   |   22 April 2021 6:32 AM GMT
మేలో థియేట‌ర్ల లాక్ డౌన్ తో జూన్-జూలైకి ఒత్తిడి!
X
నెల రోజుల పాటు థియేట‌ర్లు దిగ్భంధ‌నం చేస్తే.. ఆ త‌ర్వాత ప‌రిస్థితేమిటి? ఇప్ప‌టికే ఏప్రిల్ లో రిలీజ్ కావాల్సిన నాలుగు క్రేజీ సినిమాలు.. వాటితో పాటు చిన్నా చిత‌కా ఓ ప‌ది సినిమాల వ‌ర‌కూ వాయిదా ప‌డ్డాయి. ఇవ‌న్నీ సెకండ్ వేవ్ త‌గ్గే వ‌ర‌కూ వేచి చూడాల్సిన ప‌రిస్థితి. క‌నీసం మేలో అయినా రిలీజ్ చేయాలంటే అప్ప‌టికి కూడా మ‌హ‌మ్మారీ శాంతించే స‌న్నివేశం క‌నిపించ‌డం లేదు. మే చివ‌రి వ‌ర‌కూ ఉధృతి ఇలానే కొన‌సాగుతుంద‌న్న‌ది నిపుణుల‌ అంచ‌నా.

అందుకే ఈ ఏప్రిల్ ముగింపు నుంచి మే అంతా థియేట‌ర్లు లాక్ డౌన్ పెట్టే అవ‌కాశం ఉంది. అయితే ఏప్రిల్ - మే నెల‌ల్లో రిలీజ్ కావాల్సిన సినిమాలు అన్ని పెద్ద సినిమాలే. దీంతో ఇప్పుడు వాయిదా ప‌డ్డ సినిమాలు జూన్- జూలై వ‌ర‌కూ వేచి చూడాల్సిన ప‌రిస్థితి. ఆ రెండు మాసాల్లో ప‌రిస్థితులు చ‌ల్ల‌బ‌డితే అవన్నీ ఒక్క‌సారిగా విడుద‌లైయ్యే అవ‌కాశం ఉంది. దీంతో ఆయా రోజుల్లో రిలీజులు పెట్టుకున్న చిన్న సినిమాలు ఓటీటీ బాట పట్టే అవ‌కాశం ఉంద‌ని చాలా మంది సినీ పెద్ద‌లు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

ప్ర‌తియేటా 200 సినిమాలు టాలీవుడ్ లో రిలీజ‌వుతున్నాయి. ఇందులో 160 చిన్న సినిమాలే. అందుకే ఇప్పుడున్న క్రైసిస్ లో మెజారిటీ చిన్న సినిమాలు ఓటీటీల్లో రిలీజ్ చేయాల్సిన ప‌రిస్థితి ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. మే చివ‌రి నాటికి సెకండ్ వేవ్ ని త‌రిమి వేయ‌క‌పోతే ఈ ప‌రిస్థితి మ‌రింత తీవ్రంగా ఉంటుందని అంచ‌నా.