హాలీవుడ్ ‘జోకర్’ మళ్లీ వచ్చేస్తున్నాడు!

Fri May 07 2021 22:00:01 GMT+0530 (IST)

Preparations In Full Swing For Sequel Of Joker

2019లో విడుదలైన హాలీవుడ్ మూవీ 'జోకర్' ప్రపంచ వ్యాప్తంగా ఎంతటి సంచలనం రేకెత్తించిందో అందరికీ తెలిసిందే. దాదాపు అన్ని దేశాల్లోనూ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటిన 'జోకర్'.. వరల్డ్ వైడ్ గా దాదాపు బిలియన్ డాలర్లను కలెక్ట్ చేసినట్టు అంచనా.ఈ చిత్రంలో ప్రముఖ హాలీవుడ్ నటుడు జోక్విన్ ఫీనిక్స్ హీరోగా నటించారు. ఫీనిక్స్ నటనకు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ఫిదా అయ్యారు. ఒక్క సినిమాతోనే అతడికి అభిమానులుగా మారిపోయారు. అంతేకాదు.. అతని నటనకు ముగ్దురాలైపోయి ఏకంగా ఆస్కార్ అవార్డే వచ్చి అతడి ఒళ్లోవాలిపోయింది.

అయితే.. లేటెస్ట్ అప్డేట్ ఏమంటే.. ఈ చిత్రానికి సీక్వెల్ రాబోతోందట. ప్రముఖ నిర్మాణ సంస్థ 'వార్నర్ బ్రదర్స్' ఈ విషయాన్ని అనౌన్స్ చేయడంతో వరల్డ్ వైడ్ గా ఉన్న ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సినిమా ఎప్పుడు వస్తుందనే డిస్కషన్ కూడా స్టార్ట్ చేశారు.

అయితే.. సీక్వెల్ వస్తుందని మాత్రమే అనౌన్స్ చేశారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అందుతున్న సమాచారం ప్రకారం రాబోయే జోకర్ గానూ ఫీనిక్సే నటిస్తారని మెగాఫోన్ సైతం టాడ్ ఫిలిప్సే పట్టుకుంటాడని టాక్ నడుస్తోంది. మరిన్ని డీటెయిల్స్ తెలియాలంటే.. కొన్ని రోజులు ఆగాల్సిందే.