ఫ్రెగ్నెన్సీతో గోల్ఫ్.. ఎమీ తగ్గదే!

Sat Apr 13 2019 22:16:08 GMT+0530 (IST)

Pregnant Amy Jackson plays golf in a bikini

విలాసాల రాకుమారుడు జార్జితో ఎమీజాక్సన్ ప్రేమాయణం.. అటుపై ఒంటరి దీవుల షికార్లు.. ఫ్రెగ్నెన్సీ వ్యవహారం గురించి తెలిసిందే. ఈ ఏడాది తాను పెళ్లాడేందుకు రెడీ అవుతున్నానని..  నిశ్చితార్థానికి టైమ్ దగ్గరపడిందని హింట్ ఇచ్చిన ఎమీజాక్సన్ ఈలోగానే బేబి బంప్ తో ప్రత్యక్షమై అభిమానులకు బిగ్ షాక్ ఇచ్చింది.ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్లో ఇదే ఆసక్తికర టాపిక్. ఎమీజాక్సన్ బేబి బంప్ ఫోటోలు వెబ్ మాధ్యమంలో జోరుగా వైరల్ అవుతున్నాయి. బిడ్డను కనే ముందు ఎమీ రకరకాల ఎక్సర్ సైజులు చేస్తూ ఆ ఫోటోల్ని సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తోంది. నిన్నటి రోజున జిమ్ లో డంబెల్స్ ఎత్తుతూ ఎమీ లైట్ వెయిట్ ఎక్సర్ సైజులు చేస్తూ కనిపించింది. ఆ ఫోటోలు అంతర్జాలంలోకి జోరగా వైరల్ అయ్యాయి.

నేడు బోయ్ ఫ్రెండ్ జార్జి పనాయటౌతో కలిసి దుబాయ్ విజిట్ లో ఉంది. అక్కడ ఓ క్లబ్ లో ఎమీజాక్సన్ తీరిగ్గా గోల్ఫ్ ఆడుతూ కనిపించింది. బేబి బంప్ తోనే ఎమీ ఇలా గేమ్స్ ఆడడంపై యూత్ ఒకటే సర్ ప్రైజింగ్ గా మాట్లాడుకుంటున్నారు. దుబాయ్ షేక్ లకే ఒణుకు పుట్టే బాసిజం చూపిస్తోందంటూ ఎమీపై సెటైర్లు వేస్తున్నారు. బేబి ఆరోగ్యం బావుండాలంటే మినిమం ఫిజికల్ ఎక్సర్ సైజులు తప్పనిసరి అన్న సూత్రాన్ని ఎమీ పాటిస్తోంది. ఇక బ్లాక్ బికినీలో ఎమీ బేబి బంప్ మరింతగా హైలైట్ అయ్యింది. ప్రస్తుతం గోల్ఫ్ ఆడుతున్న ఈ వీడియో జెట్ స్పీడ్ తో ఆన్ లైన్ లో వైరల్ అయిపోతోంది. బేబీని కనే లోపే నిశ్చితార్థానికి ఏర్పాట్లు చేయాలని మరోవైపు బోయ్ ఫ్రెండ్ జార్జి పనాయటౌ హడావుడి పడుతున్నాడనేది మరో ఇంట్రెస్టింగ్ అప్ డేట్.