Begin typing your search above and press return to search.

స్పైడ‌ర్ మ్యాన్ అవ్వాల‌ని సాలెపురుగుని ప‌ట్టుకుని తిరిగిన డైరెక్ట‌ర్!

By:  Tupaki Desk   |   29 May 2023 11:44 AM GMT
స్పైడ‌ర్ మ్యాన్ అవ్వాల‌ని సాలెపురుగుని ప‌ట్టుకుని తిరిగిన డైరెక్ట‌ర్!
X
'అ'..'క‌ల్కీ'..'జాంబిరెడ్డి' లాంటి వైవిథ్య‌మైన చిత్రాల‌తో ద‌ర్శ‌కుడిగా త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు ద‌క్కించుకున్నాడు ప్ర‌శాంత్ వ‌ర్మ‌. మూడు సినిమాలు ప్ర‌శాంత్ కి మేక‌ర్ గా మంచి పేరు తీసుకొచ్చాయి. తాజాగా 'హ‌నుమాన్' అనే సినిమాతో ప్రేక్ష‌కుల్ని మెప్పించ‌డానికి రెడీ అయ్యాడు యంగ్ మేక‌ర్. ఈ సినిమా ప్ర‌మోష‌న్ లో భాగంగా ఆస‌క్తిక‌ర సంగ‌తులు చెప్పుకొచ్చాడు. ఆ వేంటో ఆయ‌న మాటల్లోనే..

'నా గ‌త చిత్రాల త‌ర్వాత ఏం చేయాల‌ని ఆలోచిస్తున్న‌ప్పుడు సూప‌ర్ హీరో సినిమా చేయాల‌న్న ఆలోచ‌న త‌ట్టింది. ఎందుకంటే సూప‌ర్ హీరోలంటే చిన్న‌ప్ప‌టి నుంచి ఎంతో ఇష్టం. స్పైడ‌ర్ మ్యాన్ చూసి నేను అలా అవ్వాల‌ని సాలెపురుగు ప‌ట్టుకుని తిరిగేవాడిని.

అంత‌ర్జాతీయ మార్కెట్ లో సూప‌ర్ హీరో అనేది క‌మ‌ర్శియ‌ల్ జోన‌ర్. తెలుగులో మ‌నం ఇలాంటి ప్ర‌య‌త్నం ఎందుకు చేయ‌కూడ‌దు అని భావించి హ‌నుమాన్ చేసా.

ప్ర‌తీ సూప‌ర్ హీరో సినిమాకి ఓ బ‌ల‌మైన ఆరిజ‌న్ ఫిల్మ్ ఉంటుంది. తొలి సినిమాలో సూప‌ర్ హీరోగా మారిన పాత్ర ప్రేక్ష‌కుల్లో బ‌ల‌మైన ప్ర‌భావం చూపుతుంది. చెడుని అంతం చేసిన త‌ర్వాత ఆ పాత్ర ఏం చేయ‌నుంద‌నే ఆస‌క్తి ఉంటుంది. ఇందులో కూడా హ‌నుమంతుడిగా తేజ పాత్ర చాలా ప్ర‌భావ వంతంగా ఉంటుంది. సినిమా పూర్త‌య్యాక త‌ను ఏం చేస్తాడ‌న్న‌ది ఆస‌క్తి రేకెత్తిస్తుంది.

దీన్ని ఓ యూనివ‌ర్శ్ లా కొన‌సాగించ‌నున్నాం. నా త‌ర్వాత సూప‌ర్ హీరో చిత్రం 'అధీర‌'కి దీనికి క‌నెక్ష‌న్ ఉంటుంది. అలాగే ఈ సినిమాకి రాజ‌మౌళి స‌ర్ కొన్ని స‌ల‌హాలిచ్చారు. వాటి వ‌ల్ల మాకు చాలా స‌మ‌యం క‌లిసొచ్చింది.

ఈ సినిమాని తొలుత పాన్ ఇండియా స్థాయిలో ఒకేసారి విడుద‌ల చేసి ..ఆ త‌ర్వాత విదేశీ భాష‌ల్లోనూ విడుద‌ల చేయ‌నున్నాం. ఇది రాజ‌మౌళి ఇచ్చిన స‌ల‌హానే. అందువ‌ల్ల ప్ర‌మోష‌న్స్ కి కావాల్సినంత స‌మ‌యం దొరుకుతుంది.