Begin typing your search above and press return to search.

ప్రశాంత్ వర్మ నెక్స్ట్ బిగ్ డైరెక్టర్..?

By:  Tupaki Desk   |   8 Jun 2023 1:00 PM GMT
ప్రశాంత్ వర్మ నెక్స్ట్ బిగ్ డైరెక్టర్..?
X
ప్రస్తుతం టాలీవుడ్ లో యంగ్ ఫిల్ మేకర్స్ తమ ప్రతిభ చూపిస్తూ సత్తా చాటుతున్నారు. ముఖ్యంగా ప్రయోగాత్మక సినిమాలు చేస్తూ తెలుగు సినిమా స్థాయిని పెంచేలా చేస్తున్నారు. కమర్షియల్ సినిమాలే కాదు కంటెంట్ ఉన్న సినిమాలు కూడా తెలుగు లో తీస్తారనేలా న్యూ ఫిల్మ్ మేకర్స్ తమ సత్తా చాటుతున్నారు. ఈ క్రమం లో భాగంగా అందరు వారి వారి ప్రతిభ కు తగినట్టుగా కృషి చేస్తున్నారు.

అయితే వారిలో నెక్స్ట్ బిగ్ డైరెక్టర్ ఎవరు అవుతారన్నది ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరుగుతుంది. ఈ క్రమం లో మొదటి సినిమా నుంచి రాబోతున్న సినిమా వరకు ప్రతీది పర్ఫెక్ట్ గా ప్లాన్ చేస్తూ ప్రేక్షకుల ను అలరిస్తున్న డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గురించి చెప్పుకోవాలి.

అ! సినిమా తో అందరిని ఆశ్చర్యపరిచిన ప్రశాంత్ వర్మ తన ప్రతి సినిమా తో సర్ ప్రైజ్ చేస్తూనే ఉన్నాడు. తెలుగు లో జాంబి సినిమా తీసిన మొదటి క్రియేటర్ అతనే అని చెప్పొచ్చు. ప్రస్తుతం హనుమాన్ సినిమా తో తన సత్తా చాటాల ని చూస్తున్నాడు. అయితే తను కేవలం సినిమాలు తీయడమే కాదు ఇంట్రెస్టింగ్ విషయాల తో కూడా సర్ ప్రైజ్ చేస్తున్నాడు. డిజిటల్ స్క్రీన్ మీద బాలకృష్ణ చేసిన అన్ స్టాపబుల్ హంగామా అందరికీ తెలిసిందే. ఆ షో ప్రోమోలు డైరెక్ట్ చేసింది ప్రశాంత్ వర్మ అని తెలిసిందే.

ఇదే కాకుండా రీసెంట్ గా జరిగిన ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా అతని సమక్షం లోనే జరిగినట్టు తెలుస్తుంది. ప్రభాస్ కటౌట్స్, స్టేజ్ సెట్ ఇదంతా ప్రశాంత్ వర్మ పర్యవేక్షణ లో నే సక్సెస్ అయ్యింది. తనలో ఉన్న ఈ మల్టీ టాలెంట్ తో ఆడియన్స్ ని అలరిస్తున్న ప్రశాంత్ వర్మ కచ్చితంగా నెక్స్ట్ బిగ్ డైరెక్టర్ అవుతాడని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే కేవలం సినిమాల తోనే కాదు తన మిగతా పనుల తో కూడా వారెవా అనిపిస్తున్నాడు ప్రశాంత్ వర్మ.

ఇప్పుడున్న యువ దర్శకుల్లో ప్రతి సినిమా తో ఒక కొత్త ప్రయోగం చేస్తూ తన డైరెక్షన్ టాలెంట్ చూపిస్తున్నాడు ప్రశాంత్ వర్మ. ప్రస్తుతం చేస్తున్న హనుమాన్ సినిమా కూడా ఎంతో ప్లానింగ్ తో చేస్తున్నట్టు తెలుస్తుంది. ఆదిపురుష్ ఈవెంట్ కి హనుమంతుడి సాయంగా ఆ సినిమా కు ప్రశాంత్ వర్మ హెల్పింగ్ అతని కి మరింత బూస్టింగ్ ఇస్తుందని చెప్పొచ్చు.

తన దగ్గర అద్భుతమైన కథలు చాలా ఉన్నాయని చెబుతున్న ప్రశాంత్ వర్మ ఒక్క స్టార్ హీరో తో సినిమా పడి అది హిట్ కొడితే మాత్రం కుర్రాడి దశ తిరిగినట్టే అని చెప్పొచ్చు. అందుకే తన దగ్గర కు వచ్చిన ఏ చిన్న అవకాశాన్ని కూడా వదలకుండా చేస్తున్నాడు ప్రశాంత్ వర్మ. ఏమో ప్రశాంత్ కత్తి లాంటి కథ తో వస్తే ప్రభాస్ అయినా ఓకే చెప్పేయొచ్చేమో లెట్స్ వెయిట్ అండ్ సీ.