Begin typing your search above and press return to search.

హ‌నుMAN .. అంజ‌నాద్రి ప్రపంచంలోకి..!

By:  Tupaki Desk   |   16 Sep 2021 7:11 AM GMT
హ‌నుMAN .. అంజ‌నాద్రి ప్రపంచంలోకి..!
X
ద‌ర్శ‌కుడిగా ప్ర‌శాంత్ వ‌ర్మ ప్ర‌యోగాల గురించి తెలిసిందే. అత‌డు స్వీయ‌ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కించిన ``అ!- క‌ల్కి-జాంబీ రెడ్డి`` .. ఇవి మూడూ విభిన్న‌మైన జోనర్ల‌లో తెర‌కెక్కి ఆక‌ట్టుకున్నాయి. ఇప్పుడు అత‌డు హ‌ను-మాన్ అంటూ తొలి తెలుగు సూప‌ర్ హీరో సిరీస్ తెర‌కెక్కిస్తున్నారు. ఇది కేవ‌లం ఒక సినిమా కాదు.. భార‌తీయ పురాణేతిహాసాల్లోని హ‌నుమంతుని క‌థ స్ఫూర్తితో వ‌రుస చిత్రాల‌ను రూపొందిస్తున్నామ‌ని ముందే టైటిల్ ప్ర‌క‌ట‌న‌లోనే వెల్ల‌డించారు.

అయితే సూర్య పుత్రుడు తేజోవంతుడైన‌ హ‌ను-మాన్ అనే ఫిక్ష‌న‌ల్ పాత్ర‌లో న‌టించే హీరో ఎవ‌రు? అన్న‌దానికి సందేహం లేకుండా జాంబి రెడ్డి క‌థానాయ‌కుడు తేజ స‌జ్జా పేరును ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.
స‌రికొత్త సినిమాటిక్ విశ్వం(అంటే కొన్ని సినిమాల సిరీస్) లోకి ప్ర‌వేశించే ముందు సీట్ బెల్ట్ క‌ట్టుకోండి!! అంటూ కాన్ఫిడెంట్ గా ప్ర‌క‌టించిన ప్ర‌శాంత్ వ‌ర్మ యువ‌హీరోతో న‌మ్మ‌కంగా ముందుకు సాగ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రిచింది.

తొలుత ఈ చిత్రంలో మెగా హీరో సాయి తేజ్ న‌టిస్తార‌ని ప్ర‌చార‌మైనా.. తేజ స‌జ్జాని ఫైన‌ల్ చేయ‌డం ఆస‌క్తిని రేకెత్తించింది. తాజాగా హ‌నుమంతు పాత్ర‌ను ప‌రిచ‌యం చేస్తున్నామ‌ని చిత్ర‌బృందం ప్ర‌క‌టించింది. అంజ‌నాద్రి ప్ర‌పంచంలోకి ప్ర‌యాణం `హ‌ను-మాన్` నుంచి హ‌నుమంతు ను ప‌రిచ‌యం చేస్తున్నామ‌ని వెల్ల‌డించారు. శ‌నివారం (18సెప్టెంబ‌ర్) ఉద‌యం 10.08 నిమిషాల‌కు ఈ లుక్ ని విడుద‌ల చేస్తామ‌ని తెలిపారు. నిర‌వ్ రెడ్డి-చైత‌న్య నిర‌వ్ త‌దిత‌రులు ఈ చిత్రంతో అసోసియేట్ అయ్యారు.