అఖిల్ ఐదో సినిమా దర్శకుడు అతనేనా?

Sun Sep 22 2019 21:01:01 GMT+0530 (IST)

Prashant Varma Movie with Akhil

'అ!' సినిమాతో దర్శకుడిగా పరిచయమైన టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ లేటెస్ట్ గా రాజశేఖర్ తో 'కల్కి' తీసిన విషయం తెలిసిందే. ఇప్పుడీ దర్శకుడు అఖిల్ తో మూడో సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నాడట. ఇటీవలే నాగ చైతన్య కి ఓ కథ వినిపించిన ప్రశాంత్ ఆ కథను చైతూ బిజీగా ఉండటం వల్ల అఖిల్ తో చేస్తాడని అంటున్నారు. లేటెస్ట్ గా అఖిల్ ప్రశాంత్ కి మధ్య కథా చర్చలు కూడా జరిగాయని సమాచారమ్.'కల్కి' తర్వాత నిజానికి ప్రశాంత్ కాజల్ తో ఓ సినిమా చేయాల్సింది. వీరిద్దరి మధ్య కూడా డిస్కర్షన్స్ నడుస్తున్నాయి. కాజల్ సొంత బ్యానర్ లో ఓ ఫిమేల్ సెంట్రిక్ సినిమాకు సన్నాహాలు కూడా జరిగాయి. కానీ కాజల్ ప్రస్తుతం 'ఇండియన్ 2' సినిమా చేస్తుంది. ఆ సినిమా కోసం బల్క్ డేట్స్ ఇచ్చేసింది. అందుకే ప్రశాంత్ తో సినిమా ఇప్పుడే ఉండకపోవచ్చు.

అంటే కాజల్ కంటే ముందే అఖిల్ తో సినిమా ఉండొచ్చు. ప్రస్తుతానికి అఖిల్ ఐదో సినిమా ఎవరితో అన్నది కూడా ఇంకా డిసైడ్ కాలేదు. బొమ్మరిల్లు భాస్కర్ అఖిల్ సినిమా తర్వాతే ప్రశాంత్ వర్మ తో సినిమాపై క్లారిటీ వస్తుంది. ప్రస్తుతం నెక్స్ట్ సినిమాల కోసం కథలు రెడీ చేసే పనిలో ప్రశాంత్ వర్మ & టీం ఉంది.