Begin typing your search above and press return to search.

ఇటు ప్ర‌శాంత్ నీల్- సుకుమార్ అటు సిద్ధార్థ్ ఆనంద్!

By:  Tupaki Desk   |   31 Jan 2023 10:14 AM GMT
ఇటు ప్ర‌శాంత్ నీల్- సుకుమార్ అటు సిద్ధార్థ్ ఆనంద్!
X
టాలీవుడ్ టు బాలీవుడ్ హీరోలు న‌మ్ముతున్న ఏకైక సిద్ధాంతం బ‌ల‌మైన స్క్రిప్టు. వైవిధ్య‌మైన క‌థాంశం. మంచి క‌థ‌.. బౌండ్ స్క్రిప్ట్ కోసం సుదీర్ఘ స‌మ‌యం వెచ్చించి గ్రౌండ్ లెవ‌ల్లో ఎక్కువ‌గా ప‌ని చేసాకే చిత్రీక‌ర‌ణ‌కు వెళ్లేందుకు ఆస‌క్తిగా ఉంటున్నారు. సీనియ‌ర్ల‌లో చిరంజీవి.. ర‌జ‌నీకాంత్ .. మ‌హేష్‌.. స‌ల్మాన్ ఖాన్.. షారూఖ్ .. దేవ‌గ‌న్ స‌హా హీరోలంతా ఇప్పుడు స్క్రిప్టు విష‌యంలో ఎంతో కండీష‌న్డ్ గా ఉంటున్నారు. ఇత‌ర హీరోలు దీనిని అనుస‌రిస్తున్నారు. ఇటీవ‌ల ద‌ర్శ‌క‌ర‌చ‌యిత‌ల‌కు ఇది ఠ‌ఫ్ టాస్క్ గా మారింది.

బాహుబ‌లి - కేజీఎఫ్ ఫ్రాంఛైజీలు ఘ‌న‌విజ‌యం సాధించ‌డానికి మాస్ ని థియేట‌ర్ల‌కు ర‌ప్పించే అన్నిర‌కాల స‌రంజామాను ఒక ప‌ద్ధ‌తిలో పేర్చుకుని ఒక అంద‌మైన క‌థ‌తో ఎమోష‌న్స్ తో మెప్పించ‌డ‌మేన‌ని అంతా విశ్లేషించారు. వీట‌న్నిటిపైనా ఆరంభం క్రిటిక్స్ నుంచి కొన్ని విమ‌ర్శ‌లు వ‌చ్చినా భారీ యాక్ష‌న్ స‌న్నివేశాల కోసం ఉప‌యోగించిన స్టంట్ కొరియోగ్ర‌ఫీ.. భారీ విజువ‌ల్ గ్రాఫిక్స్- ఎఫెక్ట్స్ ఒక నిర్ధిష్ఠ‌మైన వ‌సూళ్ల‌ ల‌క్ష్యాల‌ను చేరుకోవ‌డానికి స‌హ‌క‌రించాయి. సాహో లాంటి భారీ చిత్రం స్క్రీన్ ప్లే ప‌రంగా విఫ‌ల‌మైనా ఉత్త‌రాది నుంచి భారీ క‌లెక్ష‌న్లు తేవ‌డానికి కార‌ణం ఇందులో మాస్ ని థియేట‌ర్ల‌కు ర‌ప్పించే ఎత్తుగ‌డ ఫ‌లించింద‌ని అంగీక‌రించారు.

ఇటీవ‌ల టాలీవుడ్ ఉత్త‌రాదిన వెలుగులు విర‌జిమ్ముతోంది. బాలీవుడ్ కి ఠ‌ఫ్ కాంపిటీష‌న్ గా మారింది. దీనికి శాండ‌ల్వుడ్ అద‌నంగా బూస్ట్ నిస్తోంది. అక్క‌డ కేజీఎఫ్‌- కాంతారా విజ‌యాలు దేశం మొత్తం క‌న్న‌డ ప‌రిశ్ర‌మ వైపు చూసేలా చేశాయి. సౌత్ వెలుగులు విర‌జిమ్మేందుకు ప్ర‌తిభావంతులైన ద‌ర్శ‌కులంతా దూసుకొస్తుండ‌డం ప్ర‌ధాన పోటీకి తెర లేపింది.

అయితే ఈ పోటీకి స‌రైన స‌మాధానం ఇచ్చేందుకు బాలీవుడ్ కి చాలా స‌మ‌యం ప‌ట్టింది. అది కింగ్ ఖాన్ ప‌ఠాన్ తో సాధ్య‌మైంది. ఈ సినిమా క‌ళ్లు చెదిరే స్పై యాక్ష‌న్ కంటెంట్ తో అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌డంతో సునాయాసంగా 500 కోట్ల క్ల‌బ్ లో చేరింది. కింగ్ ఖాన్ న‌టించిన ఈ చిత్రం ఇప్ప‌టికీ అన్ స్టాప‌బుల్ వ‌సూళ్ల‌తో దూసుకెళుతోంద‌ని ట్రేడ్ చెబుతోంది. బాహుబ‌లి- సాహో- బ్ర‌హ్మాస్త్ర‌- కేజీఎఫ్ 2 వంటి చిత్రాల్లో లార్జ‌ర్ దేన్ లైఫ్ పాత్ర‌ల‌ను ద‌ర్శ‌కులు బాగా వ‌ర్క‌వుట్ చేయ‌డంతో ఇవి హాలీవుడ్ అప్పీల్ ని తేగ‌లిగాయి. మాస్ జ‌నాల్ని విప‌రీతంగా ఆక‌ట్టుకున్నాయి.

ఇప్పుడు ప‌ఠాన్ తో ద‌ర్శ‌కుడు సిద్ధార్థ్ ఆనంద్ అదే బాట‌ను అనుస‌రించాడు. దీనికోసం అత‌డు స్పై యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ కంటెంట్ ని ఎంపిక చేసుకుని త‌న‌దైన శైలిలో భారీ అడ్వెంచ‌ర‌స్ థ్రిల్ల‌ర్ గా ఈ మూవీని తెర‌కెక్కించాడు. ఒక ర‌కంగా సౌత్ నుంచి దూసుకొచ్చిన లార్జ‌ర్ దేన్ లైఫ్ పాత్ర‌ల‌కు సినిమాల‌కు అత‌డు రీక్రియేట‌ర్ మాత్ర‌మే. మ‌న‌కు ధీటైన‌ పోటీనిచ్చే ప్ర‌య‌త్నం చేశాడు. బాలీవుడ్ లో ఇంత‌కుముందు క్రిష్ - ధూమ్ 3 వంటి ఫ్రాంఛైజీల్లో లార్జ‌ర్ దేన్ లైఫ్ పాత్ర‌లు ఎంతో వ‌ర్క‌వుటైనా ఆ రికార్డుల‌న్నిటినీ కొట్టేస్తూ సౌత్ ముందు వ‌రుస‌లోకి చేరుకుంది. ఇది సిస‌లైన పోటీకి ఉత్త‌రాది ఫిలింమేక‌ర్స్ ఆలోచ‌నా త‌త్వం మార‌డానికి కార‌ణ‌మైంద‌ని చెప్పాలి.

బాలీవుడ్ లో క‌ర‌ణ్ జోహార్- త‌ర‌ణ్ ఆద‌ర్శ్ లాంటి విశ్లేష‌కులు టాలీవుడ్ ని చూసి నేర్చుకోవాల‌ని ఇంత‌కుముందే సూచించారు. ఆ త‌ర్వాత దానిని అమ‌లు చేయ‌డంలో చాలా మంది విఫ‌లం కాగా.. ప‌ఠాన్ ద‌ర్శ‌కుడు సిద్ధార్థ్ ఆనంద్ స‌ఫ‌ల‌మ‌య్యాడు. ప‌ఠాన్ చిత్రంలో లార్జ‌ర్ దేన్ లైఫ్ పాత్ర‌లకు అత‌డు జీవం పోసిన తీరు అమోఘం. అందుకే ఈ సినిమా సునాయాసంగా 600 కోట్లు పైగా వ‌సూలు చేస్తుంద‌ని ట్రేడ్ అంచ‌నా వేస్తోంది.

నిజానికి ఇటీవ‌ల రాజ‌మౌళి - ప్ర‌శాంత్ నీల్- సుకుమార్ (పుష్ప‌) లాంటి ద‌ర్శ‌కులు భారీ యాక్ష‌న్ కంటెంట్ తో గొప్ప మ్యాజిక్ చేశారు. త‌దుప‌రి వ‌రుసగా ఈ త‌ర‌హా ప్ర‌య‌త్నాల్లోనే త‌ల‌మునక‌లుగా ఉన్నారు ఈ ద‌ర్శ‌కులంతా. అయితే ఇప్పుడు భారీ యాక్ష‌న్ చిత్రాల‌తో నిరూపించిన సిద్ధార్థ్ ఆనంద్.. సిస‌లైన పోటీకి తెర లేపాడు. అత‌డితో పోటీప‌డుతూ తిరిగి ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి.. కేజీఎఫ్ ప్ర‌శాంత్ నీల్ .. పుష్ప సుకుమార్ దూసుకొస్తార‌న‌డంలో సందేహం లేదు. స్క్రిప్టు బ‌లంతో క‌థా వైవిధ్యంతో లార్జ‌ర్ దేన్ లైఫ్ పాత్ర‌లు టెక్నాల‌జీతో భ‌విష్య‌త్ భార‌తీయ సినిమాని హాలీవుడ్ కి ధీటుగా నిల‌బెట్టేందుకు ఈ ప్ర‌తిభావంతులైన దర్శ‌కులు చేస్తున్న ప్ర‌య‌త్నం ఎంతో అభినంద‌నీయం.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.