Begin typing your search above and press return to search.

రెండు రోజుల్లో 30 శాతం వ్యూస్ పెంచుకున్న ప్రాంక్ ఛానల్..!

By:  Tupaki Desk   |   16 May 2022 5:37 PM GMT
రెండు రోజుల్లో 30 శాతం వ్యూస్ పెంచుకున్న ప్రాంక్ ఛానల్..!
X
ప్రముఖ వీడియో షేరింగ్ అండ్ సోషల్ మీడియా ఫ్లాట్ ఫార్మ్ లో ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఆధారంగా ఏదైనా వీడియో ట్రెండ్ అయితే అవి ఆటోమేటిక్ గా వ్యూయర్స్ కు ఎక్కువసార్లు చూపిస్తూ ఉంటాయి. అప్పుడు వీక్షకులు ఆ వీడియోలను క్లిక్ చేసి చూస్తుంటారు కాబట్టి.. అవే యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంటుంటాయి.

అలా ప్రాంక్ వీడియో వివాదం కారణంగా గత మూడు రోజులుగా ఎప్పుడు యూట్యూబ్ లో చూసినా.. ఎవరు ఫేస్ బుక్ - ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా అవే వీడియోలు ట్రెండ్ అవుతున్నాయి. యూట్యూబ్ ఛానల్ అయితే వాటినే ఫోకస్ చేస్తూ.. వ్యూయర్ షిప్ ని క్యాష్ చేసుకుంటోందని తెలుస్తోంది.

ఇంతకుముందు ఎవరికీ తెలియని యూట్యూబ్ ఛానల్.. గత కొన్ని రోజులుగా నడుస్తున్న ప్రాంక్ వీడియోల రచ్చ కారణంగా అందరి దృష్టిలో పడింది. అసలు ఈ ఛానల్ కథ ఏంటని అందరూ తెగ చూస్తున్నారు. దీంతో గత రెండు రోజుల్లో యూట్యూబ్ కు 30 వ్యూయర్స్ పెరిగారని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది.

దీంతో ఇలా కూడా అవుతుందా అని మిగతా ఛానల్స్ అలాంటి ట్రిక్స్ ప్లే చేస్తారేమో అనే చర్చ ఇప్పుడు నెట్టింట జరుగుతోంది. మనం కూడా స్క్రిప్టెడ్ వీడియోలు చేసి రచ్చ చేస్తే అదీ ఒక అసెట్ గా మిగిలిపోతుందని భావిస్తారేమో అని అంటున్నారు.

ఎలాగూ టీవీ ఛానల్ చర్చలో పాల్గొనే వాళ్ళు తమకు తాము మేధావులుగా భావించుకుంటూ రిపోర్ట్ చేస్తారు కాబట్టి.. వాళ్ళ రచ్చ వల్ల కూడా వ్యూస్ వస్తాయని ఆలోచిస్తారేమో అనే వ్యగ్యంగా కామెంట్స్ చేస్తున్నారు.

నిజానికి ఈ మధ్య కాలంలో టీవీ ఛానల్స్ లో చర్చలు రచ్చగా మారుతుండటం మనం చూస్తున్నాం. ఇటీవల ఓ న్యూస్ ఛానల్ లో లైవ్ డిబేట్ లో యాంకర్ మాట్లాడుతూ.. గెస్టుగా వచ్చిన అతని మానసిక పరిస్థితి గురించి కామెంట్ చేసి వ్యక్తిగతంగా కించపరిచింది.

కానీ అదే యాంకర్ ఇంతకుముందు వేరే ఛానల్ లో పని చేస్తున్నప్పుడు ఒక నేషనల్ పార్టీకి పెద్ద ఎత్తున సపోర్ట్ చేస్తూ రిపోర్టింగ్ చేసింది. ఇప్పుడు ఇంకొక ఛానల్ కి వచ్చి ఏపీలో ఉన్న ఒక రీజనల్ పార్టీకి కొమ్ముకాస్తూ యాంకరింగ్ చేస్తోంది.

న్యూస్ ఛానల్స్ లో డిబేట్స్ పెట్టే యాంకర్.. ఇలా ఛానల్ మారినప్పుడల్లా స్టాండ్ మార్చుకుంటుంటే.. ఆమె మానసిక పరిస్థితి కూడా బాగాలేదనే అనుకోవాలా? అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. వాస్తవానికి ఇప్పుడు ప్రాంక్స్ వివాదంలో డిబేట్ లు పెట్టే వాళ్లలో ఎంతమంది ఆ వీడియోలు చూసి ఎంజాయ్ చేయలేదని ప్రశ్నిస్తున్నారు.

వాళ్లేమో వీడియోలు చూసి ఎంజాయ్ చేస్తారు.. కానీ చర్చలో మాత్రం పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారని అంటున్నారు. ఏదైనా టాపిక్ మీద డిబేట్ లో కూర్చున్న యాంకర్స్ మధ్యవర్తులుగా వ్యవహరిస్తూ.. పెద్దరికంగా మాట్లాడుతూ ఆ చర్చతో సమస్య పరిష్కారం చూపించేందుకు కృషి చేయాలి.

కానీ సంయమనం కోల్పోయి బూతులు తిడుతూ.. బూతులు తిట్టించుకునే పరిస్థితి వచ్చిందంటే వాళ్ళ మానసిక పరిస్థితి చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉందనే కామెంట్లు వస్తున్నాయి. ఇప్పటి నుంచైనా అర్థవంతమైన చర్చలు జరిగేలా చూస్తారేమో అని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.