తేనెలో విరిసిన తెల్లకలువ సుందరి

Mon Feb 22 2021 09:00:01 GMT+0530 (IST)

Pranitha Subhash Glamourous Pose

దీపం వెలగాలంటే నూనే పోయాలి .. తీయగా ఉంటుంది కదా అని తేనె పోయం. అలాగే పూలల్లో మకరందం పెరగాలని తేనె పోయం .. నీళ్లే పోస్తాము. కానీ తేనె పోసి వెలిగించిన దీపాలు ఎలా ఉంటాయో. తేనె పోసి పెంచిన పూలు ఎలా ఉంటాయో మీరు ఎప్పుడైనా చూశారా? ఇదిగో .. ఇక్కడ ప్రణీత ఎలా ఉంటుందో .. అచ్చు అలాగే ఉంటాయి. అసలు ఆ అందం చూడండి .. దేవలోకం నుంచి లిఫ్టులో వచ్చేసినట్టుగా లేదూ. ఆలస్యం చేస్తే ఆ కళ్లు ఆకాశాన్ని ఆక్రమిస్తాయేమోనని అనిపించడం లేదూ. ఆ చూపులపై ఎన్ని కవితలు అల్లొచ్చు .. ఎన్ని కావ్యాలు రాయొచ్చు.పుట్టమన్ను .. పట్టుతేనే కలిపిచేసినట్టుగా ముత్యాలహారం వేసిన పగడంలా ప్రణీత మిలమిల మెరిసిపోతోంది. ఆ మేనిఛాయకు హంసలు అసూయపడవలసిందే .. ఆ మేని మెరుపులకు నెమళ్లు కుళ్లుకోవలసిందే. పట్టులాంటి ఆమె శరీరంపై ఏ పట్టువస్త్రం మాత్రం నిలుస్తుంది? ఆమె తనువును తాకిన తరువాత ఏ కాంతిపుంజం మాత్రం గెలుస్తుంది? అందుకే ఆమెను చూసిన తరువాత కుర్రాళ్లు కుదురుగా ఉండలేకపోతున్నారు. ఎదురుగా వచ్చిన వాళ్లను కూడా గుర్తుపట్టలేకపోతున్నారు.

ప్రణీతలో అందం .. అంతకుమించిన నాజూకుదనం ఎక్కువ. తెరపై ఆమెను చూడగానే బాపు బొమ్మగానో ఆ బొమ్మకు దగ్గర బంధువుగానో అనిపిస్తుంది. అందువల్లనే కుర్రాళ్లలో ఆమెకి పెద్ద సంఖ్యలోనే అభిమానులు ఉన్నారు. అపజయాలు ఎదురైనా అవకాశాలు వచ్చేలా చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె హిందీ సినిమాలు చేసుకుంటూ వెళుతోంది. తెలుగులో ఒకటి రెండు కొత్త ప్రాజెక్టులలో ఆమె పేరు వినిపిస్తోంది. కాలం కలిసొచ్చి సరైన హిట్ పడితే స్టార్ హీరోయిన్ కావడానికి అన్ని అర్హతలున్న అందం ప్రణీత సొంతం అని చెప్పక తప్పదు.