చెప్పకుండా పెళ్లి చేసుకున్న సీక్రెట్ రివీల్ చేసిన ప్రణీత

Wed Jun 16 2021 10:00:17 GMT+0530 (IST)

Praneetha who revealed the secret of getting married

కరోనా.. లాక్ డౌన్ కారణంగా చాలామంది నటీమణుల పెళ్లిళ్లు మరింత త్వరగా జరిగిపోయాయి. కరోనా కారణంగా చాలామంది హీరోహీరోయిన్లు పెళ్లిపీటల మీదకు ఎక్కేశారు. అంతేకాదు.. పలువురి సెలబ్రిటీల జీవితాల్లోనూ మార్పులు చోటు చేసుకున్నాయి. కొందరు చెప్పి పెళ్లి చేసుకుంటే.. మరికొందరు చెప్పాపెట్టకుండా హడావుడిగా పెళ్లిచేసుకొని ఆశ్చర్యానికి గురి చేశారు. అలా షాకిచ్చిన వారిలో అందాల భామ ప్రణీత ఒకరు.తన చిన్ననాటి స్నేహితుడు.. బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త నితిన్ రాజును మే 31న సీక్రెట్ గా పెళ్లాడారు. చాలా కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో వారి వివాహవేడుక సాగింది. ఈ పెళ్లికి హాజరైన ఒక స్నేహితుడు సోషల్ మీడియాలో షేర్ చేయటంతో ప్రణీత మ్యారేజ్ విషయం బయటకు రావటం తెలిసిందే.

పెళ్లి తర్వాత తొలిసారి ఒక మీడియా సంస్థతో మాట్లాడిన ప్రణీత.. తన మ్యారేజ్ కు సంబంధించిన ఆసక్తికర అంశాన్ని వెల్లడించారు. కరోనా నేపథ్యం.. త్వరలో ఆషాడమాసం వస్తుండటంతో పెళ్లిని హడావుడిగా సింపుల్ గా చేసుకున్నట్లు చెప్పారు. పెళ్లికి సంబంధించి తొలుత గ్రాండ్ గా చేసుకోవాలనుకున్నాం కానీ.. కరోనా టైంలో అలా చేసుకోవటం సరికాదని.. సింఫుల్ గా పూర్తి చేసినట్లు చెప్పారు. ఆషాఢ మాసంలో పెళ్లిళ్లు చేసుకునే వీలు లేకపోవటం.. తర్వాత సరైన ముహుర్తాలు లేకపోవటంతోనే హడావుడిగా పెళ్లి పూర్తి చేసుకున్నారని చెప్పాలి.