ఫస్ట్ ట్వీట్.. నా లవ్లీ భర్త ఎన్టీఆర్

Sat Jan 29 2022 13:00:01 GMT+0530 (IST)

Pranathi First Tweet About Ntr

ఎన్టీఆర్ భార్య లక్ష్మి ప్రణతి సాదారణంగా సోషల్ మీడియాకు.. రెగ్యులర్ మీడియాకు దూరంగా ఉంటారు. కాని ఈమద్య కాలంలో ఆమె మెల్ల మెల్లగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఇన్ స్టా గ్రామ్ లో యాక్టివ్ గా తన పోస్ట్ లను షేర్ చేసే లక్ష్మి ప్రణతి ఇప్పుడు ట్విట్టర్ లో అడుగు పెట్టారు. ఆమె తన ట్విట్టర్ అకౌంట్ లో మొదటి ట్వీట్ గా ఎన్టీఆర్ తో కలిసి దిగిన ఫొటోను షేర్ చేశారు. ట్విట్టర్ లో జాయిన్ అవుతున్నందుకు సంతోషంగా ఉంది. మొదటి ట్వీట్ ను నా లవ్లీ భర్త ఎన్టీఆర్ తో దిగిన ఫొటోను షేర్ చేస్తున్నాను అంటూ ఆయన పేరును ట్యాగ్ చేసింది. ఎన్టీఆర్ హ్యాష్ ట్యాగ్ ను కూడా ఆమె షేర్ చేశారు. లక్ష్మి ప్రణతికి ఎన్టీఆర్ అభిమానులు మరియు నెటిజన్స్ ట్విట్టర్ లోకి ఘన స్వాగతం పలికారు. ఆమె ను కొన్ని గంటల్లోనే అయిదు వేల మంది ఫాలో అవ్వడం మొదలు అయ్యింది.మహేష్ బాబు భార్య నమ్రత శిరోద్కర్ ఎలా అయితే ఆమె భర్త మరియు పిల్లల గురించి రెగ్యులర్ గా సోషల్ మీడియాలో ఫొటోలు మరియు వీడియోలను షేర్ చేస్తూ అభిమానులకు చేరువ అవుతుందో అలాగే లక్ష్మి ప్రణతి కూడా రెగ్యులర్ గా తన ఇద్దరు కొడుకుల గురించి మరియు ఎన్టీఆర్ వ్యక్తిగత విషయాలు మరియు కుటుంబంలో ఆయన ఉండే తీరు ను గురించి ఫొటోల రూపంలో షేర్ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. అందుకోసం ఆమెను ఫాలో అవుతున్నట్లుగా అభిమానులు చెబుతున్నారు. ఎన్టీఆర్ మరియు లక్ష్మి ప్రణతి ల జోడీకి ఎంతో మంది అభిమానులు ఉంటారు. ఇద్దరు కూడా మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నట్లుగా ఉంటారు. ప్రతి ఒక్క సందర్బంలో తీసుకున్న ఫొటోల్లో వీరిద్దరి జోడీ అదిరి పోయిందనే కామెంట్స్ ను దక్కించుకోవడం మాత్రమే కాకుండా వీరిద్దరి ఫొటోలు ఎప్పుడు బయటకు వచ్చినా కూడా వైరల్ అవుతూనే ఉంటాయి. తాజాగా లక్ష్మి ప్రణతి సోషల్ మీడియాలో ఎంట్రీ ఇవ్వడంతో ఇకపై రెగ్యులర్ గా వరుస ఫొటోలు వస్తాయని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ కొడుకుల ఫొటోలు మరియు వీడియోలను అభిమానులు మిస్ అవుతూనే ఉన్నారు. ఇప్పుడు లక్ష్మి ప్రణతి ద్వారా అర్హ మరియు అయాన్ ల ఫొటోలు ఎలా అయితే బయటకు వస్తాయో అలాగే ఎన్టీఆర్ కొడుకుల ఫొటోలు కూడా బయటకు వస్తాయని.. వాటిని లక్ష్మి ప్రణతి షేర్ చేస్తుందని అభిమానులు ఆశ పడుతున్నారు.

ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే ఆర్ ఆర్ ఆర్ సినిమా తో విడుదలకు సిద్దంగా ఉన్నాడు. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆ సినిమాలో రామ్ చరణ్ తో కలిసి ఎన్టీఆర్ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు. కొమురం భీమ్ పాత్రలో కనిపించబోతున్న విషయం తెల్సిందే. ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ లు కలిసి చేసే యాక్షన్ విన్యాసాలు సినిమాకు ప్రథాన ఆకర్షణగా ఉంటాయని అంటున్నారు. ఇక ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో సినిమా పట్టాలెక్కబోతుంది. ఫిబ్రవరి మొదటి వారంలో సినిమాకు సంబంధించిన కీలక అప్‌డేట్స్ ను ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది. ఆలియా భట్ ను ఈ సినిమా కోసం ఎంపిక చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆమె ఇప్పటికే ఆర్ ఆర్ ఆర్ సినిమా కోసం రామ్ చరణ్ కు జోడీగా నటించిన విషయం తెల్సిందే. కనుక ఎన్టీఆర్ తో ఆమె నటించేందుకు సిద్దం అయినట్లుగా తెలుస్తోంది. ఇక ఎన్టీఆర్ 30 సినిమాకు గాను అనిరుథ్ సంగీతాన్ని అందించబోతున్నాడు. కొరటాలతో సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ మరియు బుచ్చి బాబుల దర్శకత్వంలో సినిమాలు చేసేందుకు ఎన్టీఆర్ ఓకే చెప్పాడు. ఆ రెంటిలో ఏ సినిమా మొదట పట్టాలెక్కే అవకాశం ఉంది అనేది తెలియాల్సి ఉంది.