Begin typing your search above and press return to search.

'శాకుంతలం' సారంగి పోస్టర్ టాక్..!

By:  Tupaki Desk   |   21 March 2023 11:41 AM GMT
శాకుంతలం సారంగి పోస్టర్ టాక్..!
X
గుణశేఖర్ డైరెక్షన్ లో సమంత ప్రధాన పాత్రలో వస్తున్న మైథలాజికల్ మూవీ శాకుంతలం. దిల్ రాజు సమర్పణలో నీలిమ గుణ ఈ సినిమా నిర్మిస్తున్నారు. రుద్రమదేవి తర్వాత ఎనిమిదేళ్ల గ్యాప్ తీసుకుని అత్యంత ప్రతిష్టాత్మకంగా గుణశేఖర్ తెరకెక్కించిన సినిమా ఇదే అని చెప్పొచ్చు. ఈ సినిమాలో సమంత కి జోడీగా దేవ్ మోహన్ నటించగా ప్రకాష్ రాజ్, మోహన్ బాబు వంటి స్టార్స్ కూడా నటించారు. రీసెంట్ గా శాకుంతలం సినిమా నుంచి మోహన్ బాబు లుక్ దుర్వాస మహర్షి పోస్టర్ రిలీజ్ చేశారు. మోహన్ బాబు బర్త్ డే సందర్భంగా రిలీజైన ఈ పోస్టర్ ప్రేక్షకులను అలరించింది.

ఇక సినిమాలో మరో ఇంపార్టెంట్ రోల్ లో నటిస్తున్నారు ప్రకాష్ రాజ్. శాకుంతలం సినిమాలో సారంగి పాత్రలో ప్రకాష్ రాజ్ కనిపించనున్నారు. సినిమాలో ఆయన పడవ నడిపే వ్యక్తి (బోట్ మ్యాన్) పాత్రలో నటించారు. సినిమా నుంచి సారంగి అదేనండి మన ప్రకాష్ రాజ్ లుక్ రివీల్ చేశారు.

టీజర్ లో కూడా ఇప్పటివరకు ప్రకాష్ రాజ్ పాత్రని రివీల్ చేయలేదు. శాకుంతలం సినిమాలో సారంగి పాత్ర చాలా ప్రాముఖ్యత ఉంటుందని తెలుస్తుంది. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ మరోసారి తన అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారని చిత్ర యూనిట్ చెబుతున్నారు.

లీడ్ రోల్ లో సమంతతో పాటుగా సపోర్టింగ్ రోల్స్ అన్ని తమ పాత్రలకు పూర్తి స్థాయిలో న్యాయం చేశారట. అందుకే రీసెంట్ గా శాకుంతలం ఫైనల్ కాపీ చూసిన మేకర్స్ సినిమాపై పూర్తి నమ్మకంగా ఉన్నారు. శాకుంతలం సినిమా ఏప్రిల్ 14న రిలీజ్ ప్లాన్ చేశారు.

సినిమాకు మణిశర్మ మ్యూజిక్ అందించారు. గుణశేఖర్ సినిమా అనగానే గ్రాండియర్ ఉంటుంది.. అందులోనూ మైథలాజికల్ మూవీ అవడంతో శాకుంతలం నెక్స్ట్ లెవల్ లో ఉండబోతుందని తెలుస్తుంది.

లాస్ట్ ఇయర్ యశోద సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సమంత శాకుంతలం సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించనుంది. ఈ సినిమాతో సమంత మరోసారి తన స్టామినా చూపిస్తుందని అంటున్నారు. పాన్ ఇండియా రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఫలితాన్ని అందుకుంటుందా లేదా అన్నది చూడాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.