ట్రెండీ టాక్: బండ్ల గణేష్ పై ముప్పేట దాడి!

Mon Sep 13 2021 08:00:01 GMT+0530 (IST)

Prakash raj linked maa elections with gujarat elections

మూవీ ఆర్టిస్ట్ ల ఎన్నికలు అంతకంతకు వేడి పెంచుతున్న సంగతి తెలిసిందే. నువ్వా నేనా? అంటూ హోరాహోరీ ప్రచారం సాగుతోంది. అధ్యక్ష బరిలో నిలిచిన  ప్రకాష్ రాజ్ ఏర్పాటు ఆదివారం ఏర్పాటు చేసిన  లంచ్  పార్టీపై బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. విందులు.. పార్టీలంటూ మా మెంబర్ల ఆరోగ్యాన్ని రిస్క్ లో  పెడుతున్నారని గణేష్  వ్యాఖ్యనించారు.  తాజాగా ఈ వ్యాఖ్యలపై ప్రకాష్ రాజ్ స్పందించారు. తనదైన శైలిలో కౌంటర్ వేసారు. బండ్ల గణేష్ యూ టర్న్ తీసుకున్నారు.  ఆయనకు ట్రాఫిక్ కష్టం వచ్చినట్లుంది. ఏం చేస్తాం. అందర్నీ మెప్పించలేం కదా. అందుకే బండ్ల హర్ట్ అయ్యారనుకుంటా.  అది ఆయన ఇష్టం. సమాజం మీద ఆయనకు ప్రేమ ఎక్కువగా ఉన్నట్లుంది. ఆయన ప్రవర్తన అందరికీ తెలిసిందేనని కౌంటర్లు వేశారు.ఇంకా ఆయన మాట్లాడుతూ..``గతంలో గణేష్ అటెండ్ అయిన మీటింగుల గురించి మాట్లాడితే బాగుండేది. ఎన్నికలంటే ప్రచారం కచ్చితంగా చేసుకుంటాం. అందులో తప్పేముంది. అసోసియేషన్ అంటే డిస్కషన్స్ కచ్చితంగా ఉంటాయి.  అందరితో మాట్లాడటం.. సమస్యలపై చర్చించడం.. క్యాపెనింగ్ చేయడం సహజంగా జరుగుతుంది. అలాగే ఈ రోజు మెంబర్లు అందర్నీ లంచ్ కి పిలిచాం.  అందరితోనూ దాదాపు మూడు గంటలు మాట్లాడాం. ఎన్నో విషయాలు తెలిసాయి. బండ్ల మాటలకు షాక్ అయ్యాను . గుజరాత్ లో ఎలక్షన్లు జరుగుతున్నాయి. అందరూ అక్కడ గుమిగూడుతున్నారు.  మరి దాని గురించి బండ్ల మాట్లడరేమి?  మా సభ్యుల సమస్యలు తెలుసుకున్నాం. తప్పకుండా వాటన్నింటిని పరిష్కరిస్తామని బండ్లకు  కౌంటర్ గా వ్యాఖ్యానించారు.

అలాగే  జీవితరాజశేఖర్ కూడా బండ్లపై కౌంటర్ ఎటాక్ కి దిగారు. గణేష్ గారు ఇరవై నాలుగు గంటలు మా గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది. కోవిడ్ రూల్స్ పాటిస్తూ పెళ్లిళ్లు.. సమావేశాలు జరుపుకుంటున్నారు. ఎన్ని రోజులు అని అంతా ఇంట్లో కూర్చుకుంటారు?  కోవిడ్ రూల్స్ పాటిస్తూనే మా సమావేశం జరిగిందని జీవిత తెలిపారు. ప్రకాష్ రాజ్ గారి విజన్ నచ్చింది. నాకన్నా ఆయనకు ఉన్న నెట్ వర్క్ పెద్దది. ఇండియా లెవల్లో మాకు గుర్తింపు ఉంది. దాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని అన్నారు జీవిత.