Begin typing your search above and press return to search.

విలక్షణ నటుడి వైల్డ్‌ కర్ణాటక ప్రోమోపై సూపర్ స్టార్ స్పందన...!

By:  Tupaki Desk   |   27 May 2020 7:15 AM GMT
విలక్షణ నటుడి వైల్డ్‌ కర్ణాటక ప్రోమోపై సూపర్ స్టార్ స్పందన...!
X
విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ సినిమాల్లో ఎంత విలక్షణంగా నటిస్తాడో బయట కూడా అంతే విభిన్నంగా ప్రవరిస్తుంటాడు. సామాజిక‌ స్పృహ క‌లిగిన ఆయ‌న ఏం చేసినా ప్రత్యేక‌త ఉంటుంది. ప్రజా సేవ చేయడానికి ఎప్పుడు ముందుడే ప్రకాష్ రాజ్ తనకు నచ్చని విషయాలను నిర్మొహమాటంగా సోషల్ మీడియాలో వెల్లడిస్తూ ఉంటాడు. అందుకే ఆయనకు బెదిరింపులు కూడా ఎక్కువగానే వస్తుంటాయి. అయినా సరే వాటిని లెక్కచేయకుండా తనదైన పంధాలో వెళ్తుంటారు ప్రకాష్ రాజ్. కాగా ఇప్పుడు ప్రకాష్ రాజ్ ఒక డాక్యూమెంటరీకి వాయిస్ ఓవర్ ఇవ్వాబోతున్నాడు. అడవులు ఎడారుల్లోని వివిధ రకాల జంతువులు చెట్లు పక్షులు పాములు వంటి జీవరాసులు సంబంధించిన అద్భుతమైన విజువల్స్‌ ని చూపించే డిస్కవరీ ఇప్పుడు అన్ని ప్రాంతీయ భాషల్లోకి విస్తరిస్తోంది.

దీనిలో భాగంగా ఆయా ప్రాంతీయ భాషల్లో పాపులర్ నటీనటులతో డబ్బింగ్ చెప్పిస్తూ డిస్కవరీ వైల్డ్ లైఫ్ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇప్పుడు కర్ణాటక రాష్ట్రంలోని వైల్డ్ లైఫ్ మరియు నేచర్ పై ప్రముఖ వైల్డ్ లైఫ్ అండ్ నేచర్ టెలివిజన్ ఛానల్ 'డిస్కవరీ' ఓ డాక్యూమెంటరీ చేసింది. ఈ ఎపిసోడ్స్ తెలుగుతో పాటు తమిళంలో కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు. జూన్ 5 శుక్రవారం రాత్రి 8 గంటలకు డిస్కవరీ ఛానల్‌లో ప్రసారం కాబోతున్న ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమోను రెండు భాషలలో ప్రకాష్ రాజ్ వాయిస్ ఓవర్ తో విడుదల చేశారు. 'ఒకే అరణ్యంలో ఉండే.. అనేక రకాల జంతు సంపద కథ' అంటూ వాయిస్ ఓవర్ అందించారు ప్రకాష్ రాజ్. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్న ప్రకాష్ రాజ్ ఆ అవకాశం దక్కినందుకు ఆనందం వ్యక్తం చేశారు.

ఇదిలా ఉండగా ప్రకాష్ రాజ్ ట్వీట్ కి సూపర్ స్టార్ మహేష్ బాబు స్పందించారు. కర్ణాటక వైల్డ్ లైఫ్ ఎపిసోడ్స్ కి ప్రకాష్ రాజ్ ఇచ్చిన వాయిస్ ఓవర్ కోసం ఎదురుచూస్తున్నానని ఆసక్తి వ్యక్తం చేశారు. ''ప్రకాష్ రాజ్.. మీ ఆసక్తికరమైన కథనం కోసం ఎదురు చూస్తున్నాము'' అంటూ ట్వీట్ చేశారు మహేష్ బాబు. టాలీవుడ్ లో మహేష్ బాబు - ప్రకాష్ రాజ్ ఫ్రెండ్ షిప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పలు ఇంటర్వ్యూలలో వీరిద్దరూ ఒకరికొకరు తమ మధ్య సాన్నిహిత్యాన్ని చెప్తూనే వస్తున్నారు. మహేష్ బాబు ఫస్ట్ సినిమా 'రాజకుమారుడు' నుండి ఈ ఏడాది వచ్చిన 'సరిలేరు నీకెవ్వరూ' వరకు ఒకటి రెండు సినిమాలు మినహా ప్రతి సినిమాలో ప్రకాష్ రాజ్ యాక్ట్ చేసాడు. వీరి కాంబినేషన్ లో వచ్చిన మూవీలు బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. కాగా ప్రకాష్ రాజ్ ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నాకు ఫైనాన్సియల్ గా అవసరమొస్తే మహేష్ బాబు చాలాసార్లు సహాయం చేసాడని చెప్పిన విషయం తెలిసిందే.