ప్రగ్య.. ఈసారైనా కల నెరవేరేనా?

Wed Nov 24 2021 14:13:19 GMT+0530 (IST)

Pragyya  Is The Dream Fulfilled Right Now

నటసింహా నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన `అఖండ` ఎట్టకేలకు డిసెంబర్ 2న రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలేర్పడ్డాయి. తాజాగా సినిమా రిలీజ్ విషయాన్ని ఇన్ స్టాలో షేర్ చేస్తూ ప్రగ్యా జైశ్వాల్ కూడా కన్ఫమ్ చేసింది. ఇందులో ప్రగ్యా హీరోయిన్ గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. సెన్సార్ పనులు ముగుంచుకుని రెడీగా ఉన్నట్లు యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్ ని ప్రగ్యా షేర్ చేసింది.బాలయ్య స్టైల్లో ఓ క్యాప్షన్ కూడా ఇచ్చింది. ``ఒక్క అడుగు దగ్గరగా...వూట్ వూట్..ఆగలేను`` అఖండ డిసెంబర్ 2న రిలీజ్ కానుంది. ఇక్కడ యాథృచ్ఛికంగా 21-11-2020 న `అఖండ` షూటింగ్ ప్రారంభమైంది. ఈరోజు సెన్సార్ పనులు పూర్తిచేసుకుని రిలీజ్ కి రెడీగా ఉన్నాం. ప్రేక్షకులు థియేటర్ కి వచ్చి సినిమాని తప్పక చూడండి` అంటూ కోరింది. ఈ సినిమాపై ప్రగ్యా చాలా ఆశలే పెట్టుకుంది. టాలీవుడ్ లో సరైన సక్సెస్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తోంది ఈ బ్యూటీ. ఆత్రుతగా ఎదురుచూస్తోన్న సమయంలో రాకరాక వచ్చిన అవకాశం. దీంతో ఈ సినిమాతో ఎలాగైనా సక్సెస్ అందుకుని కెరీర్ ని సాఫీగా నిర్మించుకోవాలని ఆశపడుతోంది.

ప్రస్తుతం `అఖండ` ప్రమోషన్స్ విషయంలోనూ ప్రగ్య తన ప్రయత్నం తాను చేస్తోంది. ఇదే తరుణంలో ఇన్ స్టాలో ఓ హాట్ ఫోటోని విడుదల చేసింది. షోల్డర్ లెస్ దుస్తుల్లో కోర చూపుల్లో కెమెరాకి ఫోజులిచ్చిన ఫోటో ఒకటి రిలీజ్ చేసింది. `ఫ్లవర్ పవర్` అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. ప్రగ్య ధరించిన దుస్తులపై ఫ్లోరల్ డిజైన్ ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తున్నాయి. ఇటీవల ఈ ఫోటోగ్రాఫ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.