Begin typing your search above and press return to search.

ఈ బికినీ దెబ్బ‌కు మ‌ళ్లీ సునామీ వ‌స్తుందేమో!

By:  Tupaki Desk   |   20 Jan 2020 4:24 AM GMT
ఈ బికినీ దెబ్బ‌కు మ‌ళ్లీ సునామీ వ‌స్తుందేమో!
X
ఇండోనేషియా స‌మ‌త్ర దీవుల్లో అగ్నిప‌ర్వ‌త విస్పోట‌నం గురించి ప్ర‌పంచం అంత తేలిగ్గా మ‌ర్చిపోలేదు. ఒకే ఒక్క విస్ఫోట‌నం ప్ర‌పంచ దేశాల్లో క‌ల్లోలం సృష్టించింది. మ‌హా స‌ముద్రాల వెంబ‌డి బీచ్ ల‌న్నీ అల్ల క‌ల్లోలం అయ్య‌యి. ప్ర‌మాద‌క‌ర‌ సునామీ తీరంలోని వంద‌లాది ఊళ్ల‌ను తుడిచి పెట్టేసింది. అలాంటి చోట ఇదిగో ఈవిడ విన్యాసాలేమిటో కానీ.. వామ్మోవ్ అన‌కుండా ఉండ‌లేరు మ‌రి.

కంచె బ్యూటీ ప్ర‌గ్య జైశ్వాల్ రెగ్యుల‌ర్ బికినీ ట్రీట్ గురించి తెలిసిందే. సోష‌ల్ మీడియాల్లో నిరంత‌రం ఏదో ఒక కొత్త ఫోటోషూట్ తో వేడెక్కిస్తూనే ఉంది. ఇక బికినీ బీచ్ ట్రీట్ గురించి చెప్పాల్సిన ప‌నే లేదు. ప్ర‌స్తుతం ఇండోనేషియా లోని ఎగ్జోటిక్ బీచ్ లొకేష‌న్ బాలీలో సెల‌బ్రేష‌న్ మోడ్ లో ఉంది ప్ర‌గ్య‌. అక్క‌డ రక‌ర‌కాల కాస్ట్యూమ్స్ తో ఫోటోషూట్ల‌లో నిమగ్న‌మైంది. ఇంత‌కు ముందు రెడ్ హాట్ డ్రెస్ లో ఫోటోల‌ను రిలీజ్ చేసింది. అవి జోరుగా వైర‌ల్ అయి పోయాయి. తాజాగా రిలీజ్ చేసిన పింక్ బికినీ బీచ్ ని గ‌జ‌గ‌జ ఒణికిస్తోంద‌నే చెప్పాలి.

అస‌లే స్మైలీ ఫేస్.. ఆపై క‌ర్లీ హెయిర్ .. దానికి పింక్ బికినీ యాడ‌వ్వగానే అగ్నికి ఆజ్యం పోసిన‌ట్టు కుర్రాళ్ల గుండెలు మ‌రిగి పోయాయంతే. ఐల్యాండ్ గ‌ర్ల్.. ప్రిన్సెస్ అంటూ అభిమానులు ఒక‌టే ఇదైపోతున్నారు. అన్న‌ట్టు ప్ర‌గ్య ఇంత చేసినా ఎందుక‌నో స‌రైన ఆఫ‌ర్లు అయితే రావ‌డం లేదు. 2019 ఆద్యంతం కెరీర్ ఖాళీ క‌నీసం 2020లో అయినా ఓ మాంచి అప్ డేట్ చెబుతుందేమో చూడాలి.