ఫోటో స్టొరీ: కంచె పాప పింకు బికినీ!

Thu Sep 19 2019 14:27:48 GMT+0530 (IST)

Pragya Jaiswal in Bikini

కొంతమంది హీరోయిన్లు తక్కువ సినిమాలు చేసినప్పటికీ ఎక్కువ గుర్తింపు సాధిస్తారు. కమర్షియల్ విజయాలు పెద్దగా దక్కకపోయినా వారి గుర్తింపు మాత్రం అలానే ఉంటుంది. అలాంటి భామలలో ప్రగ్య జైస్వాల్ ఒకరు.  ఈ భామ నటించిన మొదటి తెలుగు సినిమా 'కంచె' తో తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. ఆ తర్వాత చాలానే సినిమాల్లో నటించినా అవేవీ విజయాల్ని అందించలేకపోయాయి.  దీంతో స్లోగా కెరీర్ కూడా స్లో అయింది.  అయితే కెరీర్ లో ఎత్తుపల్లాలతో సంబంధం లేకుండా సోషల్ మీడియా చర్మాన్ని ఒలిచి చెప్పులు కుట్టించుకునే పనిలో చాలారోజుల నుండి ప్రగ్య బిజీగా ఉంది.  రీసెంట్ గా ప్రగ్య తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది. ఈ ఫోటోకు "సీజ్ ది డే" అనే క్యాప్షన్ ఇచ్చింది.  అయితే సీజ్ అనే పదానికి seize అనే స్పెల్లింగ్ కు బదులుగా seas అనే స్పెల్లింగ్ రాసింది. సీజ్ ది డే అంటే మీ చేతిలో ఉన్న రోజును.. సమయమాన్ని వినియోగించుకోండి.. ఆస్వాదించండి అనే అర్థం.  అలా ఆస్వాదించాలంటే చుట్టూ అందాలు ఉండాలి కదా? అందుకే తన క్యాప్షన్ కు తగ్గట్టుగా పింక్ బికినీ ధరించి ఉన్న ఒక ఫోటోను నెటిజన్ల కోసం పోస్ట్ చేసింది. ఫోటోలో ప్రగ్య గ్లామరసం చిందిస్తున్న మోడరన్ అప్సరస లాగా ఉంది. ఆ మేని రంగు.. ఆ సొగసులు.. ఫేస్ లో ఉండే గ్లో.. ఇవన్నీ చూస్తే ప్రగ్య ఇంకా ఎందుకు టాప్ హీరోయిన్ కాలేదు.. అనే అనుమానం రావడం ఖాయం.  

ఈ ఫోటో నెటిజన్లకు తెగ నచ్చింది. "హే.. పింకూ నువ్వు సూపర్ హాటు".. "స్పాట్ లెస్ బ్యూటీ".. "ఫేస్ క్రీమ్ అంబాజిడర్ లాగా ఉన్నావు".. "ఈ ఫోటో ఇంతకుముందే చూసినట్టుందే" అంటూ కామెంట్లు పెట్టారు.  అయితే ఇలాంటి ఫోటోలను ఎవరైనా కళాపోషణ కల ఫిలిం మేకర్లు చూస్తే 'కంచె' పాపకు కొత్త ఆఫర్లు రావడం ఖాయమే.