Begin typing your search above and press return to search.

ఎఫ్‌ 3 కి అఖండ లింక్‌.. మాస్ కు పండగే

By:  Tupaki Desk   |   20 Jun 2021 7:30 AM GMT
ఎఫ్‌ 3 కి అఖండ లింక్‌.. మాస్ కు పండగే
X
వెంకటేష్‌ మరియు వరుణ్‌ తేజ్ లు హీరోలుగా అనీల్ రావిపూడి దర్శకత్వంలో దిల్‌ రాజు బ్యానర్‌ లో వచ్చిన ఎఫ్‌ 2 సినిమా సూపర్‌ హిట్‌ అయ్యింది. ప్రస్తుతం ఎఫ్‌ 2 కు సీక్వెల్‌ గా ఎఫ్‌ 3 రూపొందుతుంది. ఇప్పటికే షూటింగ్‌ సగానికి పైగా పూర్తి చేసిన అనీల్‌ రావిపూడి ప్రస్తుతం ఈ సినిమాలోని ఐటెం సాంగ్‌ విషయమై చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఎఫ్‌ 3 లో ఐటెం సాంగ్‌ ను కంచె బ్యూటీ ప్రగ్యా జైస్వాల్‌ తో చేయించబోతున్నట్లుగా తెలుస్తోంది.

ఎఫ్‌ 2 లో జబర్దస్త్ బ్యూటీ అనసూయ ప్రత్యేక పాటలో కనిపించిన విషయం తెల్సిందే. ఆ పాట ప్రత్యేకంగా నిలిచి మాస్ ఆడియన్స్ ను ఎంటర్‌ టైన్‌ చేసింది. ఇప్పుడు ఎఫ్‌ 3 లో కూడా అంతకు మించి అన్నట్లుగా ఐటెం సాంగ్‌ ను అనీల్ రావిపూడి ప్లాన్‌ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. ప్రగ్యా జైస్వాల్‌ హీరోయిన్ గా ఈమద్య కాలంలో అంతగా ఆఫర్లు దక్కించుకోలేక పోతుంది. అనుకోని అవకాశం అన్నట్లుగా ఆమెకు అఖండ సినిమా లో అవకాశం దక్కింది. అఖండలో ఛాన్స్ కొట్టేసిన కారణంగానో లేదా మరేంటో కాని ఎఫ్‌ 3 లో ఈ అమ్మడికి ఐటెం సాంగ్‌ చేసే అవకాశం దక్కింది.

ప్రగ్యా జైస్వాల్‌ ఒక వైపు బాలయ్యతో అఖండ సినిమా చేస్తూనే మరో వైపు ఎఫ్‌ 3 లో ఐటెం సాంగ్‌ చేయడం వల్ల ఖచ్చితంగా ఆమె కెరీర్‌ కు ఈ రెండు సినిమాలు బూస్టర్ గా నిలుస్తాయని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వెంకీ మరియు వరుణ్‌ లతో ప్రగ్యా జైస్వాల్ వేయబోతున్న మాస్‌ స్టెప్పులతో ఎఫ్‌ 3 సినిమా మరింత మాస్‌ మసాలా మూవీగా తయారు అవుతుందేమో చూడాలి. ఈ అమ్మడి మొదటి సినిమా కంచె తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు వరుణ్‌ తో ఆడి పాడబోతుంది.