ఫొటోటాక్ : ఇంత అందాన్ని మనోళ్లు మిస్ అవుతున్నారు

Tue Sep 22 2020 05:00:07 GMT+0530 (IST)

PhotoTalk: misses so much beauty

తెలుగు ప్రేక్షకులకు కంచె సినిమాతో పరిచయం అయిన ముద్దుగుమ్మ ప్రగ్యా జైస్వాల్. తెలుగులో ఈమె నటించిన మొదటి సినిమాకే నటిగా మంచి గుర్తింపు దక్కించుకుంది. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అయ్యే ఫీచర్స్ చాలా ఉన్నాయని చాలా మంది అనుకున్నారు. కాని ఈమె అదృష్టం బాగాలేకనో లేదా మరేంటో కాని ఈమెకు ఆశించిన స్థాయిలో ఆఫర్లు రావడం లేదు. ఈమె కాస్త హైట్ ఎక్కువగా ఉండటం వల్ల ఆఫర్లు తక్కువ వస్తున్నాయి అనేది కొందరి మాట. ఆ విషయం పక్కన పెడితే సోషల్ మీడియాలో ఈమె రెగ్యులర్ ఫొటో షూట్ స్టిల్స్ చూస్తే అబ్బా ఈమె అందాలను వెండి తెరపై చూడలేక పోతున్నాం అంటూ కొందరు ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.సోషల్ మీడియాలోనే ఈ అమ్మడి అందాల ఆరబోత ఈ స్థాయిలో ఉంటే ఇక సినిమాల్లో ఈమె చేస్తే మరెంతగా స్కిన్ షో అది కూడా వెండి తెరపై చూస్తే ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. అందుకే ఈమెకు మన ఫిల్మ్ మేకర్స్ ఆఫర్లు ఇవ్వడం లేదు అంటూ కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫొటో షూట్స్ చూసిన వారు అయినా ఆమెకు ఆఫర్లు ఇవ్వాలని ఆశిస్తున్నారు.

ప్రగ్యా జైస్వాల్ గ్లామర్ షో ఇలా సోషల్ మీడియాకే పరిమితం అవ్వకుండా వెండి తెరపై కూడా వస్తే బాగుండేది. ప్రస్తుతం ఈమె తెలుగులో ఒకటి రెండు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. కాని ఇప్పటి వరకు ఏది కన్ఫర్మ్ అవ్వలేదు. ఇదే సమయంలో ఈమెకు వెబ్ సిరీస్ ల నుండి కూడా ఆఫర్లు వస్తున్నాయట. ఇప్పుడు కాకున్నా వచ్చే ఏడాది అయినా ఆ తర్వాత ఏడాది అయినా ఈమెకు లక్ కలిసి వస్తుందేమో చూడాలి.