Begin typing your search above and press return to search.

మరోసారి ప్రగ్యా పరువాల విందు.. పర్ఫెక్ట్ గ్లామర్

By:  Tupaki Desk   |   1 Jun 2023 10:20 AM GMT
మరోసారి ప్రగ్యా పరువాల విందు.. పర్ఫెక్ట్ గ్లామర్
X
టాలీవుడ్ హాట్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న అందాల భామ ప్రగ్యా జైశ్వాల్. చేసిన సినిమాలు తక్కువే అయిన ఎక్కువగా ఈ బ్యూటీ గ్లామర్ రోల్స్ లోనే కనిపించింది. కెరియర్ ఆరంభంలో కంచె సినిమా ఆమెకి నటిగా గుర్తుండిపోయే సినిమా కాగా కమర్షియల్ సూపర్ సక్సెస్ అందుకున్న మూవీ అఖండ.

వీటిలో మధ్యలో జయ జానకి నాయకా సినిమాలో తక్కువ నిడివి ఉన్న గ్లామర్ రోల్ లో కనిపించింది. ఇవి కాకుండా మిగిలిన సినిమాలు అన్ని కూడా ఆమె ఖాతాలో డిజాస్టర్స్ జాబితాలో ఉన్నవే. ఏవీ కూడా కమర్షియల్ గా ఆమె కెరియర్ కి ఉపయోగపడలేదు. అందుకే గ్లామర్ షో విషయంలో ఎలాంటి హద్దులు పెట్టుకోకపోయిన ఆశించిన స్థాయిలో సక్సెస్ ని మాత్రం టాలీవుడ్ లో ప్రగ్యా జైశ్వాల్ అందుకోలేదు.

ఇదిలా ఉంటే ప్రతి ఏటా బాలీవుడ్ చిత్రాలకి ఇచ్చే ఐఫా అవార్డుల వేడుకలో సెలబ్రిటీలు అందరూ పార్టిసిపేట్ చేస్తారు. ముఖ్యంగా బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఉన్న అందాల భామలు అందరూ కూడా ఐఫా ఉత్సవంలో గ్రీన్ మ్యాట్ పై అదిరిపోయే కాస్ట్యూమ్స్ తో తళుకులీనుతూ ఉంటారు. అందాల భామల హాట్ షోలకి ఈ వేడుక బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు.

ఐఫా వేడుకలకి వెళ్తే అందరి హీరోయిన్స్ గ్లామర్ షోకి ఒకే సారి చూసేయోచ్చు. అంతగా హాట్ బ్యూటీస్ అలరిస్తూ ఉంటారు. ఇక ఐఫా వేడుకలలో పాల్గొనే ఫోటోలని కూడా అందాల భామలు వారి ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ ఫ్యాన్స్ కి కలర్ ఫుల్ విందు అందిస్తారు. ఈ వేడుకలో ఈ సారి ప్రగ్యా జైశ్వాల్ కూడా పార్టిసిపేట్ చేసింది.

ఈ అమ్మడు రెడ్ కలర్ అవుట్ ఫిట్ తో ఐఫా సంబరాలలో హాట్ హాట్ నడుము అందాలతో కనువిందు చేసింది. అయితే హోటల్ కి వెళ్లి మార్చుకునేంత టైమ్ లేకపోవడం కారులోనే కాస్ట్యూమ్స్ మార్చేసి, మ్యాకప్ వేసుకొని బోల్డ్ గా రెడీ అయిపొయింది.

బ్లాక్ కలర్ మినీ స్కర్ట్ తో ఐఫా వేడుకకి వెళ్ళిన ప్రగ్యా జైశ్వాల్ కారులోనే కాస్ట్యూమ్స్ చేంజ్ చేసి ఐఫా కోసం సిద్ధం చేసుకున్న రెడ్ కలర్ హాట్ కాస్ట్యూమ్స్ లోకి మారిపోయింది. అక్కడి నుంచి నేరుగా గ్రీన్ కార్పెట్ పై హాట్ హాట్ ఫోటోల కి ఫోజులు ఇచ్చింది. ఇప్పుడు ఈ పిక్స్ ని అమ్మడు ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. అవి కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.