బర్త్ డే పార్టీలో గూడుపాటానీ ఏంటి రకుల్?

Sat Jan 15 2022 08:00:01 GMT+0530 (IST)

Pragya Jaiswal On Instagram

ఊరంతా భోగి సంక్రాంతి సంబరాల్లో మునిగి తేల్తుంటే ఈ చక్కనమ్మలు  మాత్రం వేరొక పార్టీలో మునిగి తేలారు. గ్రేట్ ఫ్రెండ్స్ ఇంతకీ ఇది ఏ పార్టీ? అంటే ..బర్త్ డే పార్టీ. కానీ అక్కడ చిలౌట్ ఓ రేంజులో సాగిందని అర్థమవుతోంది.ఈ పార్టీలో తన ఫ్రెండు రకుల్ తో ప్రగ్య జైశ్వాల్ ఫుల్ జోష్ ని చూపించింది. దోస్త్ మేరా దోస్త్! అంటూ ఆ ఇద్దరూ చెట్టాపట్టాల్ వేసుకుని నవ్వేస్తున్న తీరు కుర్రాళ్ల గుండెల్ని జిల్ అనిపించేస్తోంది.

అన్నట్టు ఫ్రెండ్స్ ఇద్దరూ కలిసి ముంబైని ఏదో చేస్తున్నారనేదే అభిమానులందరి డౌట్. ఆ ఇద్దరూ కలిసి హిందీ పరిశ్రమలో పెద్ద ప్లానింగ్ తో ఉన్నారని ఇంతకుముందే గుసగుసలు వినిపించాయి. ఇటీవలి కాలంలో ఇరువురు హిందీ కెరీర్ పరంగా బిజీ అవుతున్నారు. రకుల్ ఒకేసారి మూడు నాలుగు సినిమాలతో బిజీ అయితే ప్రగ్య కూడా వరుస చిత్రాలకు సంతకాలు చేస్తోంది. అందుకే ఈ బర్త్ డే పార్టీలో రకుల్ అంత స్పెషల్ గా కనిపించిందన్నమాట. ఇంతకీ ప్రగ్య జైశ్వాల్ కి కేక్ మాత్రమే తినిపించిందా ఏదైనా ఖరీదైన కానుకిచ్చిందా గ్రేట్ ఫ్రెండు రకుల్? తనే చెబుతుందేమో!