Begin typing your search above and press return to search.

ఫోటో స్టొరీ: మ్యాగ్జిమమ్ సిటీ.. మ్యాగ్జిమమ్ బ్యూటీ

By:  Tupaki Desk   |   18 July 2019 1:30 AM GMT
ఫోటో స్టొరీ: మ్యాగ్జిమమ్ సిటీ.. మ్యాగ్జిమమ్ బ్యూటీ
X
'కంచె' బ్యూటీ ప్రగ్య జైస్వాల్ ఈమధ్య కెరీర్లో స్లో అయింది. అలా అని సోషల్ మీడియాలో ఏమాత్రం స్లో కాలేదు. జెట్ స్పీడ్ తో దూసుకుపోతోంది. రెగ్యులర్ అప్డేట్స్ ఇస్తూ నెటిజన్లతో టచ్ లో ఉంటోంది. తాజాగా మరోసారి తన ఇన్స్టా ఖాతా ద్వారా కొన్ని ఫోటోలు పోస్ట్ చేసింది. ఈ ఫోటోషూట్ లొకేషన్ ముంబైలోని బాంద్రా ఫోర్ట్..బ్యాండ్ స్టాండ్ . కొన్ని ఫోటోల నేపథ్యంలో బాంద్రా - వర్లి సీ లింక్ కూడా కనిపిస్తోంది.

ఈ ఫోటోలో ప్రగ్య ధరించిన దుస్తులను డిజైన్ చేసిన వారు టాలీవుడ్ సెలబ్రిటీ డిజైనర్ నీరజ కోన. నలుపు రంగు చీర.. లైట్ కలర్ స్లీవ్ లెస్ బ్లౌజ్ లో వయ్యారాలను ఒలకబోస్తూ.. సెక్సీ భామ తరహాలో పోజులిచ్చింది. ఈ ఫోటోలకు ప్రగ్య ఇచ్చిన క్యాప్షన్ "ఉదయం సమయంలో వీచే ఈ ఋతుపవనాల చల్లనిగాలి నా మనసులో మెదులుతున్న ఆలోచనలకు ఓ కొత్త దిశను ఇస్తోంది. ఇదంతా మ్యాగ్జిమమ్ సిటీ లోనే జరుగుతుంది. #Mumbaimerijaan". ముంబైని 'మ్యాగ్జిమమ్ సిటీ'.. 'సిటీ ఆఫ్ డ్రీమ్స్' అనే పేర్లతో పిలుస్తారని తెలిసిందే కదా.

ఒక ఫోటోలో ప్రగ్య తన చీర కుచ్చెళ్లను సరిచేసుకుంటూ ఓ సెన్సువల్ ఎక్స్ ప్రెషన్ తో పోజిచ్చింది. అసలు చీరకట్టులోని అందమంతా ఈ ఫోటోలోనే ఉన్నట్టుగా అనిపిస్తోంది. మరో ఫోటోలో చిరునవ్వుల హరివిల్లు విరిసేలా నవ్వింది. ఇంకో ఫోటోలో నలుపు రంగు రాళ్ల నేపథ్యంలో తలపై చేతిని పెట్టుకొని ఒక సెక్సీ ఎక్స్ ప్రెషన్ ఇచ్చింది. ఈ ఫోటోలకు రెస్పాన్స్ అదిరిపోయింది. "బ్లాక్ అండ్ వైట్.. స్టన్నింగ్".. "మాగ్జిమమ్ సిటీ.. మ్యాగ్జిమమ్ బ్యూటీ".. "రియల్ బ్యూటీ ఆన్ ఫైర్" అంటూ కామెంట్లు పెట్టారు. ఇక సినిమాల విషయానికి వస్తే మెగాస్టార్ చిరంజీవి చిత్రం 'సైరా' లో ఒక కీలకపాత్రలో నటిస్తోంది.