వైరల్ అవుతున్న 'బాలయ్య - ప్రభుదేవా'ల డాన్స్ ప్రాక్టీస్ పిక్!

Fri Jul 03 2020 14:40:01 GMT+0530 (IST)

Prabhu deva choreographs Balayya

నటసింహం బాలయ్య అంటే తెలుగు ప్రేక్షకులలో ఎనలేని అభిమానం. ఎందుకంటే అన్నగారు సీనియర్ ఎన్టీఆర్ తనయుడిగా నటన రంగంలోకి అడుగుపెట్టిన బాలయ్య.. ఆ మహామనిషి నటవారసుడిగా తెలుగు రాష్ట్రాలలో పేరొందుతున్నాడు. బాలయ్య సినిమాలు ఎంతో మందిలో ఉత్సాహాన్ని నింపుతాయి. ఆయన విడుదల టైంలో థియేటర్లలో చూస్తే అర్ధమవుతుంది బాలయ్య అంటే జనాలు ఎందుకు పడిచస్తారో. నిజానికి బాలయ్య అభిమానులను ఎన్నడూ నిరాశపర్చలేదు. సినిమాలే నిరాశ పరుస్తాయి. అందుకే ఆయన అభిమాన గణం పెరుగుతూనే ఉంది తప్ప తరగట్లేదు. ఇక సినిమాలలో బాలయ్య డాన్స్ గురించి.. డైలాగ్స్.. యాక్షన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అవే ఈ రోజు నందమూరి బాలకృష్ణను కాస్త బాలయ్య బాబు అని ప్రేమగా పిలుచుకునేలా చేసాయి.అయితే సోషల్ మీడియాలో తక్కువ కనిపించే బాలయ్య.. అభిమానులు సెలబ్రిటీల వలన అప్పుడప్పుడు సందడి చేస్తూనే ఉంటాడు. ఆయన గురించి సోషల్ మీడియాలో ఏ వార్త వినిపించినా అది హల్చల్ అవడం ఖాయం. ఇక తాజాగా స్టార్ కొరియోగ్రాఫర్ అండ్ డైరెక్టర్ ప్రభు దేవా నేతృత్వం లో బాలయ్య బాబు డాన్స్ స్టెప్ ప్రాక్టీస్ చేస్తున్న ఓల్డ్ గోల్డెన్ ఫోటో ఒకటి చక్కర్లు కొడుతోంది. ఆ ఫోటో ఏ సినిమాలో.. ఏ సాంగ్ సమయం లో దిగిందో తెలియదు కానీ.. ఫోటోలో ప్రభుదేవా బాలయ్య ఇద్దరు కూడా చాలా యంగ్ గా ఉన్నారు. ఇక ఆ ఫోటో లో బాలయ్య ప్రభు దేవా చూపిస్తున్న డాన్స్ స్టెప్ ను తదేకం గా గమనిస్తున్నాడు. ప్రస్తుతం ఆ పిక్ తెగ వైరల్ అవుతోంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం బాలయ్య తన 106వ సినిమాను బోయపాటి శ్రీను దర్శకత్వం లో చేస్తున్నాడు. మహమ్మారి కారణం గా సినిమా షూటింగ్ ఆగి పోయింది.