బాహుబలికి దేవసేన దొరికిందా..?

Sat Apr 01 2023 13:01:07 GMT+0530 (India Standard Time)

Prabhas wedding is viral on social media

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మ్యారేజ్ పై ఎప్పుడూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ నడుస్తూనే ఉంటుంది. బాహుబలికి ముందే ప్రభాస్ పెళ్లిపై న్యూస్ రాగా ఆ సినిమా తర్వాత నాలుగైదు సినిమాలు వచ్చినా కూడా ప్రభాస్ పెళ్లి కాలేదు.ప్రభాస్ పెళ్లి ఎప్పుడు అన్నది ఒక సమాధానం లేని ప్రశ్నగా మారింది. ప్రభాస్ కూడా తన మ్యారేజ్ పై మీడియా చేస్తున్న హడావిడి చూసి సింపుల్ గా నవ్వి ఊరుకుంటాడే తప్ప పెద్దగా పట్టించుకోడు. కృష్ణం రాజు ఉన్నప్పుడే ప్రభాస్ పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు.. కానీ అది జరగలేదు.

ఇక లేటెస్ట్ గా ప్రభాస్ పెళ్లిపై సోషల్ మీడియాలో ఒక క్రేజీ న్యూస్ వైరల్ గా మారింది. త్వరలోనే ప్రభాస్ ఓ ఇంటి వాడు అవుతున్నాడని అంటున్నారు. మన బాహుబలికి దేవసేన దొరికేసిందని టాక్. మరి ఇంతకీ ఎవరా లక్కీ గాళ్ అన్నది మాత్రం తెలియాల్సి ఉంది.

ప్రభాస్ మ్యారేజ్ పై అతనికన్నా ఫ్యాన్స్ ఎక్కువ ఆసక్తిగా ఉన్నారు. ఏజ్ బార్ అవుతుంది బాస్ పెళ్లి చేసుకో అంటూ ప్రభాస్ కు ఫ్యాన్స్ ఎప్పుడూ సలహాలు ఇస్తూ వస్తున్నారు. వరుస సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్ పెళ్లి గురించి ఎప్పుడూ సీరియస్ గా ఆలోచించలేదు. కానీ ఇప్పుడు ఆ టైం వచ్చిందని ప్రభాస్ ఫిక్స్ అయ్యాడు.

ఫ్యామిలీ మెంబర్స్ సలహా మేరకు త్వరలోనే పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడట ప్రభాస్. ప్రభాస్ పెళ్లిపై అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ త్వరలోనే వస్తుందని అంటున్నారు. ప్రస్తుతం సలార్ మారుతి మూవీ రెండు సినిమాలను చేస్తున్నాడు ప్రభాస్. ఆదిపురుష్ తన పోర్షన్ పూర్తి చేయగా ఆ సినిమా రిలీజ్ టైం లో ప్రమోషన్స్ లో పాల్గొనాల్సి ఉంది. ఆదిపురుష్ జూన్ లో రిలీజ్ అవుతుండగా సలార్ సెప్టెంబర్ రిలీజ్ ప్లాన్ చేశారు.

ఈ ఏడాది ప్రభాస్ సినిమాలతో పాటుగా మ్యారేజ్ విషయంలో కూడా ఫ్యాన్స్ ని ఖుషి చేస్తారని తెలుస్తుంది. బాహుబలి ప్రభాస్ మనసు గెలిచిన ఆ దేవసేన ఎవరు..? ప్రభాస్ లాంటి స్టార్ ని పెళ్లాడే ఆ అమ్మాయి ఎవరన్నది ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ డిస్కషన్ నడుస్తుంది.