'సర్కారు వారి పాట' పై ప్రభాస్ రివ్యూ..?

Fri May 13 2022 14:00:01 GMT+0530 (IST)

Prabhas review on Sarkaru Vaari Paata

'సరిలేరు నీకెవ్వరు' సినిమా తర్వాత దాదాపు రెండున్నరేళ్ల గ్యాప్ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు.. ఇప్పుడు ''సర్కారు వారి పాట'' వంటి పక్కా కమర్షియల్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.గత కొంతకాలంగా సబ్టిల్ రోల్స్ కే పరిమితమైన మహేశ్.. ఈసారి జోవియల్ గా ఉండే మాస్ క్యారక్టర్ తో మెప్పించారు. పరశురాం దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి తొలి రోజు మిశ్రమ స్పందన వచ్చింది.

అయినప్పటికీ టాక్ తో సంబంధం లేకుండా మంచి ఓపెనింగ్స్ రాబట్టినట్లు నివేదికలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే 'సర్కారు వారి పాట' చిత్రాన్ని యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గురువారం రాత్రి చూసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

SVP సినిమా డార్లింగ్ కు చాలా బాగా నచ్చిందని చెప్తున్నారు. అలాగే ఇందులో మహేష్ బాబు కామెడీ టైమింగ్ మరియు ఫైట్స్ కూడా నచ్చాయని.. వాటిని బాగా ఎంజాయ్ చేశానని ప్రభాస్ తన సన్నిహితులతో చెప్పినట్లుగా నెట్టింట వార్తలు వస్తున్నాయి.

ఇందులో నిజమెంతో తెలియదు కానీ.. మహేష్ బాబు నటించిన 'సర్కారు వారి పాట' చిత్రానికి ప్రభాస్ రివ్యూ ఇవ్వడమనేది ఇద్దరి మ్యూచువల్ ఫ్యాన్స్ ను కచ్చితంగా ఖుషీ చేస్తుందని చెప్పవచ్చు.

బయటకు కనిపించకపోయినా నిజానికి ప్రభాస్ మరియు మహేష్ చాలా సాన్నిహిత్యంగా ఉంటారు. రెగ్యులర్ గా మీట్ అవ్వకపోయినా.. కలిసినప్పుడు మాత్రం ఒకరిపై ఒకరు అభిమానాన్ని చాటుకుంటుంటారు.

ప్రభాస్ నటించిన 'వర్షం' ఆడియో ఫంక్షన్ కు మహేష్ చీఫ్ గెస్టుగా హాజరైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అనేక సందర్భాల్లో వీరిద్దరూ ఒకే వేదికను పంచుకున్నారు. ఇటీవల ఏపీ సీఎం జగన్ తో భేటీకి ఒకే ప్లైట్ లో కలిసి వెళ్లారు.
 
సమావేశంలో పక్కపక్కనే కూర్చున్న మహేష్ - ప్రభాస్.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతున్న సమయంలో వారిద్దరి బాండిగ్ చూసి ప్రతి ఒక్కరూ స్టన్ అయ్యారు. ఇద్దరూ చాలా క్లోజ్ గా ఉండడాన్ని చూసి అభిమానులు మురిసిపోయారు.

స్టార్ హీరోలిద్దరూ కలిసి ఒక మల్టీస్టారర్ చేసి ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తే బాక్సాఫీస్ రికార్డ్స్ అన్నీ బద్దలు అవడం ఖాయమని కామెంట్స్ చేసారు. మహేష్ బాబు - ప్రభాస్ కలిసి ఉన్న ఫోటోలు ఆ మధ్య చాలా రోజులపాటు నెట్టింట సందడి చేశాయి.

ఇక సినిమాల విషయానికొస్తే.. పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ప్రభాస్ ప్రస్తుతం వరుసగా భారీ సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. SVP తర్వాత త్రివిక్రమ్ తో చేయనున్న మహేశ్.. ఇదే క్రమంలో రాజమౌళి దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీ మొదలు పెట్టనున్నారు.