Begin typing your search above and press return to search.

ఆ విషయంలో ప్రభాస్ మరోసారి డిజప్పాయింట్ చేసాడట!!

By:  Tupaki Desk   |   16 Jan 2021 10:33 AM GMT
ఆ విషయంలో ప్రభాస్ మరోసారి డిజప్పాయింట్ చేసాడట!!
X
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడుగా తెరకెక్కుతున్న 'రాధేశ్యామ్' సినిమాకోసం దేశవ్యాప్తంగా డార్లింగ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జిల్ ఫేమ్ రాధా కృష్ణకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుండి విడుదల చేసిన పోస్టర్లు చూసే అభిమానులలో అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. కానీ నిజానికి ఫ్యాన్స్ నిరాశలోనే ఉన్నారని సమాచారం. ఎందుకంటే మిగతా స్టార్ హీరోల సినిమాలతో పోలిస్తే రాధేశ్యామ్ షూటింగ్ ఎప్పుడో మొదలయింది. కానీ ఇంతవరకు రాధేశ్యామ్ టీజర్ బయటికి రాలేదు. ఇప్పటికే వేరే హీరోల సినిమాలు రిలీజ్ డేట్స్, టీజర్స్ విడుదల చేసేసారనే నిరాశలో ఉన్నారట ఫ్యాన్స్. ఇదివరకు టైటిల్ విషయంలో, మోషన్ పోస్టర్ విషయంలో కూడా ఇలాగే చేశారు రాధేశ్యామ్ మేకర్స్.

నిజానికి ఈ సినిమా లాక్ డౌన్ ముందే యూరప్ షెడ్యూల్‌ను ముగించుకుంది. పీరియాడికల్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమా స్టోరీ 1960ల కాలంనాటి ప్రేమికుల నేపథ్యంలో రూపొందుతుందట. ఈ సినిమా ప్రేక్షకులను తప్పకుండా అలరిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు మేకర్స్. అయితే ఈ సినిమాలో తెలుగే కాకుండా బాలీవుడ్ నటులు కూడా నటిస్తుండటంతో.. పాన్ ఇండియా మూవీగా ఐదు బాషలలో విడుదల కాబోతుంది. ఇక ఇటీవలే సినిమా షూటింగ్ పూర్తయిందట. ఇక సంక్రాంతి సందర్బంగా రాధేశ్యామ్ టీజర్ విడుదల చేస్తారని అభిమానులు ఎదురుచూసారు. కానీ ఈసారి కూడా దర్శకనిర్మాతలు ప్రేక్షకులను నిరాశకు గురిచేశారు. కానీ సినిమా మాత్రం సమ్మర్ లో రిలీజ్ అవుతుందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. అయితే అప్పటివరకు ఈ సినిమా నుండి టీజర్ రాదా..? అంటూ ఫ్యాన్స్ సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఇక జస్టిన్ ప్రభాకరణ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడట. ఇదిలా ఉండగా ప్రభాస్ తాజాగా సలార్ సినిమా షూటింగ్ ప్రారంభించిన సంగతి తెలిసిందే.