ప్రభాస్ వచ్చేదెప్పుడంటే ?

Fri Dec 06 2019 22:48:07 GMT+0530 (IST)

కొన్ని పెద్ద సినిమాలకు ప్రారంభం రోజే క్లారిటీగా రిలీజ్ డేట్ ప్రకటించేస్తారు మేకర్స్. అప్పటి నుండే ఫ్యాన్స్ లో జోష్ మొదలవుతుంది. అయితే  ప్రభాస్ కొత్త సినిమా 'జాన్' మాత్రం ఇంకా రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకోలేదు. దీనికి కారణం మేకర్స్ ప్లానింగ్ లోపం. అవును యూ.వి.క్రియేషన్స్ లో భారీ బడ్జెట్ తో తీసిన 'సాహో' తెలుగు రాష్ట్రాల్లో ఫ్లాప్ అయింది. అందుకే 'జాన్' కి సంబంధించి కాస్త ఆచి తూచి వ్యవహరిస్తున్నారు. ఎప్పటికప్పుడు అవుట్ పుట్ చూసుకుంటూ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరిపిస్తున్నారు.అందుకే ఇప్పటి వరకూ ఫస్ట్ లుక్ కూడా వదల్లేదు మేకర్స్. అయితే న్యూ ఇయర్ కి ఫస్ట్ లుక్ వదిలి రిలీజ్ డేట్ ప్రకటించే చాన్స్ ఉందనే టాక్ వినిపిస్తుంది. అయితే ప్రారంభంలో సినిమాను సంక్రాంతికి తీసుకురావాలనుకున్నారు. కాని కుదరలేదు అందుకే సమ్మర్ కయినా రిలీజ్ చేసేలా సన్నాహాలు జరుగుతున్నాయట. సో ప్రభాస్ కొత్త సినిమాతో వచ్చేది సమ్మర్ కే అన్నమాట.