Begin typing your search above and press return to search.
ప్రభాస్ న్యూ ప్రాజెక్ట్.. కాంబో అదిరింది!
By: Tupaki Desk | 30 May 2023 2:00 PMయంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ఈ మధ్య కాలంలో మాంచి ఊపులో కనిపిస్తున్నాడు. అందుకే మరే బడా హీరో చేయని విధంగా సినిమాల మీద సినిమాలు చేస్తూ దేశ వ్యాప్తంగా సెన్సేషన్ అవుతోన్నాడు. దీంతో మరింత ఉత్సాహంగా ప్రాజెక్టులు పూర్తి చేసుకుంటూ వస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభాస్ - యూవీ క్రియేషన్స్ బ్రేకప్ వార్త మరింత హాట్ టాపిక్‌గా మారింది.
కొన్నేళ్ల క్రితం ప్రభాస్ స్నేహితులు యూవీ క్రియేషన్స్ అనే సంస్థను స్థాపించారు. ఇందులో యంగ్ రెబెల్ స్టార్ పలు చిత్రాలను కూడా చేశాడు. అయితే, ఇప్పుడీ సంస్థ కొంచెం స్లో గా వస్తున్నారు .
యూవీ క్రియేషన్స్ సంస్థతో ప్రభాస్‌కు కొంచెం గ్యాప్ రావడం తో టాలీవుడ్‌లోని బడా నిర్మాతకు కలిసి వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఆయన మరెవరో కాదు.. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్. ఈయన ఇప్పటికే టాలీవుడ్‌లో ఎన్నో సినిమాలను నిర్మించి బిగ్ ప్రొడ్యూసర్‌గా పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడీయన ఏకంగా ప్రభాస్‌తో చేతులు కలిపి కోట్ల డీల్ చేసుకున్నారట.
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్.. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో 'స్పిరిట్' అనే సినిమాను ప్రకటించాడు. దీనికి టీ సిరీస్ బ్యానర్‌తో పాటు యూవీ క్రియేషన్స్ నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తున్నట్లు ప్రకటించారు.
కానీ, ఇప్పుడు యూవీ సంస్థ దీని నుంచి తప్పుకోవడంతో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఇందులో భాగస్వామిగా చేరిందట. ఇందుకోసం విశ్వప్రసాద్.. యూవీ సంస్థకు కొన్ని కోట్ల రూపాయలతో డీల్ క్లోజ్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే, 'ఆదిపురుష్' తెలుగు రాష్ట్రాల హక్కులను ఏకంగా రూ. 170 కోట్లకు కొనుగోలు చేశారు.
'స్పిరిట్' మాత్రమే కాదు.. ప్రభాస్ - మారుతి కాంబినేషన్‌లో రూపొందుతోన్న సినిమాను కూడా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థనే తీసుకుంది. వాస్తవానికి దీన్ని డీవీవీ దానయ్య ప్రొడ్యూస్ చేయాల్సి ఉండగా.. ఆయన తప్పుకున్నారు. దీంతో ఆ బాధ్యతను విశ్వ ప్రసాద్ తీసుకున్నారు. మొత్తానికి ప్రభాస్ కోసం ఆయన కొన్ని కోట్ల రూపాయలతో రిస్క్ చేస్తున్నారని చెప్పాలి.