Begin typing your search above and press return to search.

ప్రభాస్ పూర్తిగా కోలుకోలేదా..?

By:  Tupaki Desk   |   3 Oct 2022 10:05 AM GMT
ప్రభాస్ పూర్తిగా కోలుకోలేదా..?
X
ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ గురించి ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల డార్లింగ్ మోకాలికి సర్జరీ అయిన సంగతి తెలిసిందే. అయితే అగ్ర హీరో దాన్నుంచి పూర్తిగా కోలుకోలేని తెలుస్తోంది.

ప్రభాస్ నటించిన "ఆది పురుష్" సినిమా ఫస్ట్ లుక్ మరియు టీజర్ ను ఆదివారం మేకర్స్ రిలీజ్ చేశారు. అయోధ్యలో గ్రాండ్ గా జరిగిన ఈవెంట్ కు ప్రభాస్ తో పాటుగా హీరోయిన్ కృతి సనన్ మరియు డైరెక్టర్ ఓం రౌత్ కలిసి హాజరయ్యారు.

అయితే టీజర్ లాంచ్ సందర్భంగా ప్రభాస్ ర్యాంప్‌ పై కాస్త అసౌకర్యం నడవం ఫ్యాన్స్ ఆందోళన చెందేలా చేసింది. హాఫ్ ఫీట్ హైట్ కూడా లేని స్టెప్స్ దిగడానికి కృతి సనన్ - ఓం రౌత్ సహాయం తీసుకున్నారెందుకు అని అందరూ ఆలోచించారు. డార్లింగ్‌ మోకాలి గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదేమో అని సందేహించారు.

ప్రభాస్ ఆ మధ్య స్పెయిన్ వెళ్లి మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకున్నట్లు వార్తలు వచ్చాయి. సన్నిహిత వర్గాలు ఈ విషయాన్ని ధృవీకరించాయి. వైద్యుల సూచన మేరకు రెస్ట్ తీసుకున్న ప్రభాస్.. కొన్ని రోజులు అన్ని సినిమాల షూటింగులను పక్కన పెట్టేసాడు.

ఇటీవల తన పెదనాన్న కృష్ణంరాజు చనిపోయిన తర్వాత ప్రభాస్ 'సలార్' మూవీ షూటింగ్ లో పాల్గొన్నారు. హైదరాబాద్ రామోజీ స్టూడియోలో జరిగిన ఈ షెడ్యూల్ కు సంబంధించిన కొన్ని ఆన్ లోకేషన్ పిక్స్ నెట్టింట హల్ చల్ చేశారు. దీంతో డార్లింగ్ గాయం నుంచి కోలుకుని.. ఎప్పటిలాగే చిత్రీకరణలో పాల్గొన్నారని అందరూ భావించారు.

కానీ ఇప్పుడు 'ఆది పురుష్' టీజర్ లాంచ్ ఈవెంట్ లో ప్రభాస్ కాస్త ఇబ్బందిగా నడవడం చూసి అభిమానులు కంగారు పడ్డారు. అయితే చికిత్స అనంతరం రెస్ట్ తీసుకున్నప్పటికీ.. అది పూర్తిగా సెట్ కాలేదని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

దీని కారణంగానే ప్రభాస్ మెట్లు ఎక్కేప్పుడు.. అడుగులు వేస్తున్నప్పుడు నొప్పితో బాధ పడుతున్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలో డార్లింగ్ టీమ్ నడిచే మార్గంలో అడుగులు వేయడానికి అవసరమైన చర్యలు తీసుకుంటూ వస్తున్నారట.

ఇటీవల 'సలార్' షెడ్యూల్ లో సైతం రిస్క్ లేని సన్నివేశాలను మాత్రమే చిత్రీకరించారని అంటున్నారు. కాకపోతే మిస్ కమ్యూనికేషన్ కారణంగా 'ఆది పురుష్' మేకర్స్ తగు జాగ్రత్తలు తీసుకోలేకపోయారట. ఒక అడుగు ఎత్తుతో ప్రభాస్ ఎంట్రీ కోసం వేదికను నిర్మించారట. దీంతో డార్లింగ్ నడవడానికి ఇబ్బంది పడ్డారని పేర్కొంటున్నారు.

వేదిక మీద నడవడానికి ప్రభాస్ అసౌకర్యంగా ఉన్నట్లు వీడియోలలో స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే గాయం నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాతే షూటింగ్ లో పాల్గొనాలని.. తగినంత విశ్రాంతి తీసుకోవాలని డార్లింగ్ అభిమానులు కోరుకుంటున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.