Begin typing your search above and press return to search.

వీడియో: డార్లింగ్ భీమ‌వ‌రం యాస బావుందే

By:  Tupaki Desk   |   24 Jan 2020 4:59 AM GMT
వీడియో: డార్లింగ్ భీమ‌వ‌రం యాస బావుందే
X
టాలీవుడ్ స్టార్ హీరోలు చూడ‌టానికి ఎంత క్లాస్ గా క‌నిపించినా లోన మాస్ మాత్రం ట‌న్నుల కొద్దీ దాగి ఉంటుంది. మాట్లాడే మాట తీరు.. భాష యాస ప్ర‌తిదీ ప‌క్కా మాసీ గా ఉంటుంది. సంద‌ర్భానుసారం దానిని బ‌య‌ట పెడుతుంటారు. ఆ క్వాలిటీ వ‌ల్ల‌నే వెండితెర‌పైనా దానిని ఎలివేట్ చేయ‌డంలో ఎంత మాత్రం త‌డ‌బ‌డ‌రు. మ‌న‌కు ఉన్న స్టార్ హీరోల్లో మ‌హేష్‌- చ‌ర‌ణ్‌- బ‌న్ని- ఎన్టీఆర్- ప్ర‌భాస్ వీళ్లంతా ప‌క్కా మాస్.

మ‌హేష్ మాట‌తీరు ప‌రిశీలిస్తే .. క్యాజువ‌ల్ గా ఉన్న‌ప్పుడు ఎంతో జోవియ‌ల్ గా మాట్లాడేప్పుడు మాస్ బ‌య‌ట‌ప‌డుతుంది. చెర్రీ- బ‌న్ని- ప్ర‌భాస్ కూడా చాలాసార్లు మాసీగా మాట్లాడుతూ క‌నిపించారు. ఇప్పుడు డార్లింగ్ ప్ర‌భాస్ కూడా ఓ వీడియోలో అలా మాసీగా.. సాధా సీదా కుర్రాడిలా మాట్లాడ‌డం క‌నిపించింది. ప‌క్కా భీమ‌వ‌రం - గోదారి యాస ఎలా ఉంటుందో ఈ వీడియో చూస్తేనే అర్థ‌మ‌వుతోంది.

``ఆ ఎద‌వ‌కి చెప్పా నాకు చెప్ప‌రా అని.. అయినా చెప్ప‌క‌పోతే ఎలా?`` అంటూ ప్ర‌భాస్ ఎంతో క్యాజువ‌ల్ గా మాట్లాడేసిన వీడియో ఒక‌టి ప్ర‌స్తుతం అభిమానుల్లో వైర‌ల్ అవుతోంది. మావోడు ప‌క్కా మాస్ అంటూ ఫ్యాన్స్ ఈ వీడియో చూసి ఫిదా అయిపోతున్నారు. మొన్న రెబ‌ల్ స్టార్ కృష్ణంరాజు బ‌ర్త్ డే ఈవెంట్లోని స‌న్నివేశ‌మిది.

తెర‌పై పాత్ర‌ను బ‌ట్టి సంద‌ర్భాన్ని బ‌ట్టి క్లాసీగా క‌నిపించొచ్చు కానీ.. లోన ఉన్న మాస్ మాత్రం ఇదిగో ఇలా బ‌య‌ట‌ప‌డిపోతుంటుంది అంతే. చాలా స‌ర‌దాగా .. అంతే సింపుల్ గా అంద‌రితో క‌లిసిపోయి మాట్లాడేప్పుడు ఇది బ‌య‌ట‌ప‌డుతుంటుంది. స్టార్ హీరోలు అంతా ఇంతే సింపుల్. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ - అలీ క‌లిసినా అంతే మ‌రి. లోన ఉన్న‌ మాస్ ఏ రేంజులో ఉంటుందో ఊహించాల్సిన ప‌నే లేదు.

వీడియో కోసం క్లిక్ చేయండి