Begin typing your search above and press return to search.

ఫ్యాన్స్ ను హర్ట్ చేసిన ప్రభాస్..!

By:  Tupaki Desk   |   14 Jan 2021 11:33 AM GMT
ఫ్యాన్స్ ను హర్ట్ చేసిన ప్రభాస్..!
X
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్ గా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం “రాధే శ్యామ్”. పీరియాడిక్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

అయితే.. ఈ చిత్రం కన్నా ముందుగా టీజర్ కోసం వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. కొత్త సంవత్సరం రోజున టీజర్ వచ్చేస్తుందంటూ హింట్ ఇచ్చిన దర్శకుడు.. కనీసం సంక్రాంతికి కూడా విడుదల చేయలేదు. దీంతో.. ఫ్యాన్స్ తీవ్ర ఆవేదనలో కూరుకుపోయారు.

సంక్రాంతి దాటిపోతున్నప్పటికీ.. ఈ మోస్ట్ అవైటెడ్ టీజర్ విషయంలో ఇంకా మౌనంగానే ఉన్నారు మేకర్స్. దీంతో.. సోషల్ మీడియాలో ప్రభాస్ ఫ్యాన్స్ రగిలిపోతున్నారు. టీజర్ రిలీజ్ చేస్తే.. ఈ పండుగను మరింత ఎంజాయ్ చేసేవాళ్లమని ఆవేదన చెందుతున్నారు.

అయితే.. టీజర్ రిలీజ్ విషయం పక్కనబెడితే.. కనీసం ఎప్పుడు వస్తుందో సమాచారం కూడా ఇవ్వట్లేదనేది ఫ్యాన్స్ లేటెస్ట్ కంప్లైంట్. ఈ టీజర్ కోసం ఎంతో ఆశగా వెయిట్ చేస్తున్నప్పటికీ.. మేకర్స్ మాత్రం ఎలాంటి అప్డేట్ కూడా ఇవ్వట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి, ఇకనైనా మేకర్స్ టీజర్ విషయంలో క్లారిటీ ఇస్తారో లేదో చూడాలి.